HOME » NEWS » politics » LOKSABHA ELECTIONS 2019DONT LOSE YOUR FRIENDS OVER DIFFERENT POLITICAL IDEOLOGIES CR

జెండాలు వేరు... ఎజెండాలు వేరు... కానీ స్నేహం మాత్రం ఒక్కటే...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్నికల అరుదైన దృశ్యాలు... భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపిస్తున్న 2019 లోక్‌సభ ఎన్నికలు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 24, 2019, 5:35 PM IST
జెండాలు వేరు... ఎజెండాలు వేరు... కానీ స్నేహం మాత్రం ఒక్కటే...
ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న ఎన్నికల ఫోటోలు
  • Share this:
కాంగ్రెస్, బీజేపీల జెండాలు ఒకే దగ్గర కలిసి ప్రచారం... ఈ పార్టీలతో పాటు వామపక్ష జెండాలు కూడా. నాలుగు భిన్నమైన పార్టీలు, విభిన్నమైన ఎజెండాలు ఉన్న పార్టీలు... ఒకే దగ్గర కలిసి ప్రచారం... అసలు కలలో కూడా సాధ్యం కాదేమో! అయితే అది సాధ్యమైంది. స్నేహం రెండు చేతులను మాత్రమే కాదు... నాలుగు జెండాలను కూడా దగ్గరికి చేస్తుందని నిరూపించారు నలుగురు స్నేహితులు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫోటో చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఒక కారులో నలుగురు యువకులు కూర్చొని, పార్టీ ప్రచారానికి బయలు దేరారు. అయితే ఈ నలుగురు స్నేహితులు ఒక్క పార్టీకి మద్ధతుగా ప్రచారం చేయడం లేదు. ఒకరు కాంగ్రెస్ జెండాను పట్టుకుంటే, మరొకరు బీజేపీ జెండాను ఎగురవేశారు. ఇంకొకరు సీపీఎం ఎర్రజెండా రెపరెపలాడిస్తే... మరోవ్యక్తి సీపీఐ జెండా పట్టుకున్నాడు. కారుకి ఉన్న నాలుగు చక్రాల్లా నాలుగు వైపులా నాలుగు భిన్నమైన పార్టీలు జెండాలు ఎగురవేస్తూ ప్రచారం నిర్వహించారు కేరళ రాష్ట్రానికి చెందిన యువకులు. ఈ అరుదైన దృశ్యాన్ని ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది.



‘ఇది కేవలం కేరళలో మాత్రమే సాధ్యం... వేరే పార్టీలకు మద్ధతుకు తెలిపినంత మాత్రాన మీ స్నేహితులను దూరం చేసుకోకండి’ అంటూ ఓ వ్యక్తి ఈ ఫోటోను పోస్ట్ చేశాడు. దీనితో పాటు ఓ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల వ్యక్తులు కలిసి ఓటు వేసేందుకు క్యూలైన్‌లో నిల్చున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.




భిన్నత్వంలో ఏకత్వాన్ని నింపుకున్న భారతదేశంలో ఇలాంటి అరుదైన చిత్రాలు ఎన్నో కనిపిస్తాయి. ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు అన్నదమ్ములు కూడా రెండు భిన్నమైన పార్టీల తరుపున ప్రచారం నిర్వహిస్తారు. అయితే పార్టీల ఎజెండా కారణంగా అన్నాదమ్ములు విడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ స్నేహానికి ఏ జెండా, పార్టీ ఎజెండా అడ్డురావని నిరూపిస్తూ వచ్చిన ఈ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Published by: Ramu Chinthakindhi
First published: April 24, 2019, 5:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading