Home /News /politics /

LOKSABHA ELECTIONS 2019 NIZAMABAD POLLS BE HELD USING BALLOT PAPERS MS

తెలంగాణలో ఒక్క నిజామాబాద్‌లోనే బ్యాలెట్ ఎన్నికలు.. ఎందుకో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ballot Battle In Nizamabad : నామినేషన్లకు చివరి తేదీ అయిన సోమవారం 179 మంది నామినేషన్లు దాఖలు చేశారు. జగిత్యాల, మెట్‌పల్లి, నిజామాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు నామినేషన్లు వేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చాలా కాలంగా పంటలకు మద్దతు ధర డిమాండ్ చేస్తున్న పసుపు, ఎర్రజొన్న రైతులు.. తమ నిరసన తెలియజేసేందుకు ఈ పద్దతిని ఎంచుకున్నారు.

ఇంకా చదవండి ...
    తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలోని మిగతా లోక్‌సభ నియోజకవర్గాలకు ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. నిజామాబాద్‌లో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.

    నామినేషన్లకు చివరి తేదీ అయిన సోమవారం 179 మంది నామినేషన్లు దాఖలు చేశారు. జగిత్యాల, మెట్‌పల్లి, నిజామాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు నామినేషన్లు వేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చాలా కాలంగా పంటలకు మద్దతు ధర డిమాండ్ చేస్తున్న పసుపు, ఎర్రజొన్న రైతులు.. తమ నిరసన తెలియజేసేందుకు ఈ పద్దతిని ఎంచుకున్నారు.

    నిజామాబాద్ లోక్‌సభకు మార్చి 20న 7.. మార్చి 22న 56 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు 179 మంది నామినేషన్లు దాఖలు చేయడంతో.. మొత్తం నామినేషన్ల సంఖ్య 242కి చేరింది. అయితే నామినేషన్ల పరిశీలన తర్వాత చివరకు ఎంతమంది పోటీలో నిలుస్తారో అన్నది తేలాల్సి ఉంది. మార్చి 28న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో.. ఆలోపు ఎవరైనా తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటారా? అన్నది కూడా చూడాల్సి ఉంది.


    మొత్తం మీద సీఎం కేసీఆర్ తనయ, ఎంపీ కవిత ఇలాఖాలో రైతులు నామినేషన్లతో నిరసనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత బరిలో దిగుతుండగా.. కాంగ్రెస్ నుంచి మధుయాష్కీ పోటీ చేస్తున్నారు. అయితే పంటలకు కనీస గిట్టుబాటు ధర లేక ఆగ్రహంతో నామినేషన్లు దాఖలు చేసిన రైతుల ప్రభావం ఇక్కడ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
    First published:

    Tags: CM KCR, Farmers Protest, Lok Sabha Election 2019, MP Kavitha, Nizamabad, Nizamabad S29p04, Telangana, Telangana Lok Sabha Elections 2019, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు