HOME »NEWS »POLITICS »loksabha election 2019 upa 3 more likely than nda 3 says shashi tharoor

ఎన్డీయే-3 కంటే యూపీఏ-3కే ఛాన్స్ ఎక్కువ: శశి థరూర్

ఎన్డీయే-3 కంటే యూపీఏ-3కే ఛాన్స్ ఎక్కువ: శశి థరూర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్(ఫైల్ ఫోటో)

పలు ప్రాంతీయ పార్టీలు బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకే సుముఖంగా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కంటే తక్కువ సీట్లు సాధించినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఉన్నాయని అన్నారు.

  • Share this:
    వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ తక్కువ ఎంపీ స్థానాల్లో గెలిచినా...కూటమి పార్టీల సాయంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకే ఎక్కవగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ధీటుగా సన్నద్ధమవుతోందన్నారు. అయితే కూటమి పార్టీల వైఖరి ఇంకా పూర్తిగా తెలియకపోవడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు రావచ్చో అంచనావేయడం కష్టమన్నారు. అయితే పలు ప్రాంతీయ పార్టీలు బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకే సుముఖంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

    వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీయే-3 ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశాలకంటే యూపీఏ-3 ప్రభుత్వం కొలువుదీరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని థరూర్ విశ్లేషించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 282 ఎంపీ స్థానాల్లో గెలుచుకున్న బీజేపీకి ...వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలకు అటు ఇటుగా దక్కే అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. దేశ వ్యాప్తంగా వెతికినా తమతో పొత్తు పెట్టుకునే పార్టీలేవీ బీజేపీకి కనిపించడం లేదన్నారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు కూడా ఇప్పుడు దూరమయ్యాయని వివరించారు.



    పెట్రోల్ ధరల పెరుగుదల, పన్నులు, నిరుద్యోగ సమస్య తదితర అంశాలు వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఉంటాయని చెప్పారు. అలాగే మత విధ్వేషాలు పెరగడం కూడా ఎన్నికల ప్రచారంలో చర్చనీయాంశంగా మారుతుందని విశ్లేషించారు.
    Published by:Janardhan V
    First published:January 19, 2019, 15:27 IST

    टॉप स्टोरीज