పవన్ కళ్యాణ్ విషయంలో జేడీకి జేపీ కౌంటర్...

జయప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ

పార్టీని నడిపించుకోవడానికి, తనను నమ్ముకున్న వారి భవిష్యత్ కోసం పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తే తప్పేం లేదని జయప్రకాష్ నారాయణ అన్నారు.

 • Share this:
  పవన్ కళ్యాణ్ విషయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ తప్పుపట్టారు. ఇటీవల పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించాలని డిసైడ్ అయ్యారు. అయితే, దీన్ని జేడీ లక్ష్మీనారాయణ తప్పుపట్టారు. ఎప్పుడూ సినిమాల్లో నటించబోనని పదే పదే చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల్లోకి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. అలాగే, పవన్ కళ్యాణ్‌కు నిలకడ లేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అందు వల్ల తాను జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగానే స్పందించారు. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, గనులు, పాలఫ్యాక్టరీలు లేవంటూ పరోక్షంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబునాయుడులకు అవన్నీ ఉన్నాయనే సంకేతాలు ఇచ్చారు. వాళ్లు వ్యాపారాలు చేసుకుంటున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. అలాగే, తనకు భారీగా జీతాలు వచ్చే ఉద్యోగాలు కూడా లేవంటూ నేరుగా సీబీఐలో ఉన్నత స్థానంలో రిటైర్ అయిన లక్ష్మీనారాయణకు కౌంటర్ ఇచ్చారు.

  లక్ష్మీనారాయణ రాజీనామా లేఖ


  ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌ను లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ సమర్థించారు. పవన్ కళ్యాణ్ చేసిన దాంట్లో తప్పేం లేదన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హీరో కాబట్టి, ఆయన సినిమాల్లో నటిస్తే డబ్బులు వస్తాయి. అవన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారని, మళ్లీ ఇప్పుడు మేకప్ వేసుకోవడం తప్పేం కాదన్నారు. సక్రమ మార్గంలో ఆదాయాన్ని ఆర్జించడం తప్పేం కాదని స్పష్టం చేశారు. ‘నిజాయితీగా గౌరవప్రదంగా సంపాదించుకుంటున్నప్పుడు ఎవరికి సంజాయిషీ ఇవ్వాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. తన పార్టీని కాపాడుకోవడానికో, లేదంటే తన చుట్టూ ఉన్న వారి భవిష్యత్తు గురించి ఆలోచించో సినిమాల్లో నటిస్తే దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు.’ అని జేపీ అభిప్రాయపడ్డారు.

  లక్ష్మీనారాయణ రాజీనామాను ఆమోదిస్తూ పవన్ కౌంటర్


  హిందీలో హిట్ అయిన పింక్ సినిమా తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కొన్ని రోజుల క్రితం మొదలైంది. అలాగే, క్రిష్ హీరోగా మరో సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ సంతకం చేశాడు. రెండు సినిమాలు చేస్తుండడంతో మరికొందరు నిర్మాతలు కూడా పవర్ స్టార్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: