ఆర్టీసీ సమ్మెపై ఆయనే కరెక్ట్... కేసీఆర్‌కు జేపీ షాక్

ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ తీరును లోక్‌ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ సమర్థించారు.

news18-telugu
Updated: October 14, 2019, 2:14 PM IST
ఆర్టీసీ సమ్మెపై ఆయనే కరెక్ట్... కేసీఆర్‌కు జేపీ షాక్
జేపీ, కేసీఆర్
news18-telugu
Updated: October 14, 2019, 2:14 PM IST
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె అంశంపై కేసీఆర్‌కు ఊహించని మద్దతు లభించింది. ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ పూర్తి అసంబద్ధమని లోక్‌సత్తా నేత, కూకట్ పల్లి మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ స్పష్టంచేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను పూర్తిగా సమర్థిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ సహేతుకం కాదని... అసలు కార్మికులు ప్రభుత్వాన్ని శాసించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కార్మికులు ప్రభుత్వానికి కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వాలని ఆయన అన్నారు.

వ్యాపారపరమైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సరికాదని జేపీ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అయితే జేపీ వంటి నేత ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని సపోర్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ వినియోగం విషయంలో జేపీ చేసిన వ్యాఖ్యలు సీఎం కేసీఆర్‌కు తీవ్ర ఆగ్రహం కలిగించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన నేరుగానే జేపీపై విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడిన జేపీ... కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడటం ఏమిటని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. తనను అంతగా విమర్శించిన కేసీఆర్‌ను ఆర్టీసీ సమ్మె విషయంలో జేపీ సపోర్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.


First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...