పార్లమెంట్‌లో సీన్ రివర్స్.. టీడీపీ ఆఫీసులో వైసీపీ

చంద్రబాబు, జగన్ (File)

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్లమెంట్‌లో టీడీపీకి పార్లమెంటరీ పార్టీ ఆఫీసు ఉంది. ఇప్పుడు అది ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

  • Share this:
    పార్లమెంటులో సీన్ రివర్స్ అయింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్లమెంట్ ఆఫీసులో వారికి కేటాయించిన కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వివిధ రాజకీయ పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలను కేటాయించారు. మొత్తం 15 పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో గదులు కేటాయించారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఉత్వర్వులు జారీ చేశారు. పార్లమెంటులోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఐదో నెంబర్‌ గదిని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి కేటా​యించారు. గతంలో ఆ గదిలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం కొనసాగింది. ఎంపీల సంఖ్య ఆధారంగా చేసుకొని పార్లమెంటులో ఈ పార్టీ కార్యాలయాలు కేటాయించారు. పార్టీకి ఐదుగురు ఎంపీల కంటే ఎక్కువ ఉంటేనే పార్టీ కార్యాలయాలు కేటాయిస్తారు. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలిచారు.

    పార్లమెంట్‌లో వివిధ పార్టీలకు ఆఫీసులు కేటాయిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ జారీ చేసిన మెమో


    కేశినేని నాని (విజయవాడ), గల్లా జయదేవ్ (గుంటూరు), రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం) మాత్రమే గెలిచారు. దీంతోపాటు నలుగురు రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు టీడీపీని వీడారు. అదే సమయంలో వైసీపీ తరఫున 22 మంది లోక్‌సభ సభ్యులు గెలిచారు.
    First published: