Lok sabha elections Live: మాజోలికొస్తే ఖబడ్దార్..హైదరాబాద్ ఖాళీ అవుతుంది:చంద్రబాబు

Lok sabha elections Live:

 • News18 Telugu
 • | April 07, 2019, 16:21 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED 3 YEARS AGO

  AUTO-REFRESH

  Highlights

  17:4 (IST)

  కృష్ణా జిల్లా తిరువూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  కేసీఆర్ ఏపీపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు..
  జగన్‌కు ఒక్క ఛాన్స్ ఎందుకివ్వాలి?

  13:13 (IST)

  సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని 2014 నుంచి 2019 వరకు పాలన సాగించామన్నారు ప్రధాని మోదీ. 2047 నాటి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని ఆయన ఆకాక్షించారు. అందుకు తగ్గట్టుగానే ప్రగతికి పునాదులు వేస్తున్నామన్నారు. సబ్సిడీలు తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సబ్సిడీలు వదులుకోవాలని కోరుతున్నామన్నారు ప్రధాని. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందన్నారు. 50 ఏళ్ల నుంచి ఢిల్లీలోని ఏసీల్లో కూర్చున్న పెద్దలు పేదల కష్టాలను పట్టించుకోలేదన్నారు. ప్రజల నుంచి వచ్చిన వాళ్లే పేదల గురించి ఆలోచిస్తారన్నారు. భారత ప్రజలకు ఎంత ఇచ్చినా తక్కువే అనే వాదన ఉందన్నారు. అది తప్పు అని ప్రజలు నిరూపించారన్నారు మోదీ.

  12:54 (IST)

  జలశక్తి మంత్రాలయాలను తయారు చేస్తామన్నారు మోదీ. నదీ జలాలను సాధ్యమైనంతగా వినియోగించే విధంగా కృషి చేస్తామన్నారు. మన్ కీ బాత్ సమయంలో అనేక మంది నీటి సమస్యలను మా దృష్టికి తెచ్చారన్నారు.

  12:52 (IST)

  బీజేపీ మేనిఫెస్టో రూపొందించేందుకు రాజ్ నాథ్ సింగ్ సారథ్యంలో కమిటీ ఎంతో కష్టపడిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మేనిఫెస్టోలోని హామీలను 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశ స్వాత్రంత్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా... 75 లక్ష్యాలను నిర్ధేశించుకున్నామన్నారు. వన్ మిషన్ వన్ డైరెక్షన్ అనే లక్షంతో ముందుకు సాగుతున్నామన్నారు మోదీ. దేశ అభివృద్ధి కోసం వివిధ మార్గాలను ఎంచుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో దేశ ప్రజల ముందు పలు సవాళ్లు ఉన్నాయన్నారు. రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలు నీటి వనరులపై దృష్టి పెట్టాయన్నారు ప్రధాని.

  12:34 (IST)

  బీజేపీ మేనిఫెస్టోలో కీలక అంశాలు :

  -దేశవ్యాప్తంగా గిడ్డంగుల నెట్‌వర్క్ ఏర్పాటు
  - ఆర్గానికి ఫార్మింగ్‌లో లాభాలు పెరిగేందుకు చర్యలు
  - మత్య్స సంపద యోజన కింద రూ.10 వేల కోట్లు కేటాయింపు
  - ఆక్వాకల్చర్‌కు తేలిగ్గా రుణ సదుపాయం
  - సముద్ర గడ్డి పెంచే దిశగా రైతులకు సదుపాయాలు
  - 2022 నాటికి అందరికీ పక్కా ఇళ్లు
  - భారత్ నెట్ ద్వారా 2022 నాటికి అందరికీ ఇంటర్నెట్
  - జల్ జీవన్ మిషన్ ద్వారా 2024 నాటికి అందిరికీ తాగు నీరు
  - సడక్ సే సమృద్ధి ద్వారా అందరికీ రోడ్లు
  - స్వచ్ఛ భారత్ మిషన్ కింద వృథా నీటిని తిరిగి మంచి నీరుగా మార్పు

  12:28 (IST)

  బీజేపీ మేనిఫెస్టోలో కీలక అంశాలు :
  - దేశ శ్రేయస్సు కోసం ఉమ్మడి పౌర స్మృతి బిల్లు ప్రవేశం
  - రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులపై లక్ష రూపాయల వరకు తీసుకునే రుణాలకు వడ్డీ రాయితీ
  - రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులపై లక్ష రూపాయల వరకు తీసుకునే రుణాలకు వడ్డీ రాయితీ
  - అన్ని వర్గాల రైతులకూ కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తింపు.
  - చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్ పథకం, చిన్న వ్యాపారులకు పెన్షన్ పథకం అమలు
  - ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం, జాతీయ భద్రత, తీరప్రాంత రక్షణ, సైనికుల సంక్షేమానికి పెద్దపీట
  - జమ్మూకాశ్మీర్‌లో శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రయత్నాలు
  - రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వర్తింపు
  - చిన్న, సన్నకారు రైతులకు పింఛను
  - వ్యవసాయ గ్రామీణ రంగానికి రూ.25 లక్షల కోట్ల పెట్టుబడి
  - ప్రధానమంత్రి ఫసల్ భీమో యోజన కింద అందరికీ భీమా వర్తింపు
  - రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాల సరఫరా.
   


  మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. సమయం తక్కువగా ఉండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గులాం నబీ ఆజాద్, సచిన్ పైలట్, యోగి ఆదిత్యనాథ్ వంటి జాతీయ స్థాయి నేతలు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఏపీలో టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేన నేతలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఎండలను సైతం లెక్కచేయకుండా ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ న్యూస్ 18 అందిస్తోంది.