EVM: వాచీ గుర్తుకు ఓటేస్తే బీజేపీకి పడిందంటున్న సీనియర్ నేత

ఈవీఎంలపై అనుమానం కలుగుతోందని, తాను వాచీ గుర్తుకు(నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తు) ఓటేస్తే కమలం గుర్తు(బీజేపీ)కు పడిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు.

news18-telugu
Updated: May 9, 2019, 6:25 PM IST
EVM: వాచీ గుర్తుకు ఓటేస్తే బీజేపీకి పడిందంటున్న సీనియర్ నేత
శరద్ పవార్ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: May 9, 2019, 6:25 PM IST
ఎన్నికల్లో ఈవీఎంలను తొలగించి, బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలని విపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ సహా 21 ప్రతిపక్ష పార్టీలు వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా వారికి చుక్కెదురైంది. అయితే, ఈవీఎంలపై అనుమానం నెలకొన్ననేపథ్యంలో ఓ సీనియర్ రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హల్‌చల్ చేస్తున్నాయి. ఈవీఎంలపై అనుమానం కలుగుతోందని, తాను వాచీ గుర్తుకు(నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తు) ఓటేస్తే కమలం గుర్తు(బీజేపీ)కు పడిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు. గురువారం ఆయన ఈవీఎంపై మాట్లాడుతూ.. ‘ఈవీఎంలపై నాకూ అనుమానాలు ఉన్నాయి. హైదరాబాద్, గుజరాత్‌లో కొందరు నా ముందు ఈవీఎం మిషన్ పెట్టి బటన్ నొక్కాలని చెప్పారు. వారు చెప్పినట్లు వాచీ గుర్తుపై నొక్కా. కానీ, నా ఓటు బీజేపీకి పడింది. అది నేను కళ్లారా చూశా.’ అని తెలిపారు. అయితే అన్ని ఈవీఎంలు అలాగే ఉన్నాయని తాను చెప్పలేనని స్పష్టం చేశారు.

కాగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని విపక్షాల బృందం వీవీప్యాట్‌ల లెక్కింపుపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, వారి అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దాంతో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌తో భేటీ అయ్యి ఈవీఎంలు, వీవీప్యాట్లపై తమ సమస్యలను చెప్పుకున్నారు.

First published: May 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...