రూ.10 కోట్లతో ఈవీఎం హ్యాక్‌చేసి గెలవచ్చు..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఈవీఎంలను ఎన్నో విధాలుగా హ్యాక్ చేయవచ్చని.. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: April 24, 2019, 7:56 PM IST
రూ.10 కోట్లతో ఈవీఎం హ్యాక్‌చేసి గెలవచ్చు..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
సీఈసీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు (ANI)
news18-telugu
Updated: April 24, 2019, 7:56 PM IST
ఈవీఎంలపై దుమారం రేగుతున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి వచ్చిన వ్యక్తులు ఈవీఎంలను హ్యాక్ చేస్తారని బాంబు పేల్చారు. రూ.10 కోట్లిచ్చిన అభ్యర్థిని ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా గెలిపిస్తారని వ్యాఖ్యానించారు. ముంబైలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంత దారుణ పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవని విమర్శించారు చంద్రబాబు.

రష్యన్లు మన ఈవీఎంలను హ్యాక్ చేస్తారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఇస్తే అభ్యర్థులను గెలిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఉన్నా లేకున్నా...దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.
చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం


ముంబైలో ఎన్నికల ప్రచారం అనంతరం కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం, ఈవీఎంల పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈవీఎంలను ఎన్నో విధాలుగా హ్యాక్ చేయవచ్చని.. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈవీఎంలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు.

మరోవైపు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సైతం ఈవీఎంలపై సంచలన ఆరోపణలు చేశారు. యూపీలో జరిగిన మూడో దశ ఎన్నికల్లో ఈవీఎంలు సరిగా పనిచేయలేదని విమర్శించారు. ఏ మీట నొక్కినా బీజేపీకే ఓటు పడుతుందని ఆరోపించారు.
First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...