Home /News /politics /

LOK SABHA ELECTIONS 2019 POLICE SEIZES RS 8 CRORES FROM A CAR IN HYDERABAD SK

కారులో రూ.8 కోట్లు సీజ్...ఆ పార్టీవే అంటున్న పోలీసులు

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

బ్యాంకు నుంచి ఆ నగదును తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఐతే ఎన్నికలవేళ ఓ కారులో ఇంత భారీ మొత్తంలో డబ్బు దొరకడం జంట నగరాల్లో సంచలనం రేపింది.

    ఎన్నికలవేళ తెలుగు రాష్ట్రాల్లో ధన ప్రవాహం జోరుగా సాగుతోంది. విచ్చల విడిగా నోట్ల కట్టలు పంచుతున్నారు నేతలు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వేలకు వేలు ముట్టజెబుతున్నారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు పట్టబడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌‌లోని నారాయణగూడలో ఏకంగా రూ.8 కోట్లు దొరికాయి. ఓ కారులో తరలిస్తున్న నోట్ల కట్టలను నారాయణగూడ ఫ్లైఓవర్ సమీపంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

    వాహనంలో భారీగా నగదును తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. కారులో నుంచి రూ.8 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐతే సీజ్‌చేసిన డబ్బు బీజేపీకి చెందినదిగా పోలీసులు చెబుతున్నారు. బీజేపీ అధికారిక ఖాతా నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డబ్బులు డ్రా చేసినట్లు తెలుస్తోంది. బ్యాంకు నుంచి ఆ నగదును తరలిస్తున్న గోపి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    పార్టీ అవసరాల కోసమే డబ్బులు తీసుకెళ్తున్నట్లు గోపీ పోలీసులకు తెలిపారు. అవి పార్టీ డబ్బులు అయినప్పటికీ ఎన్నికలవేళ ఇంత భారీ మొత్తంలో ఎందుకు డ్రా చేశారు? ఒకేసారి రూ.8 కోట్లును బ్యాంకు అధికారులు ఎలా ఇచ్చారు? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే తొలి విడత లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో ఇంత భారీ మొత్తంలో డబ్బు దొరకడం జంట నగరాల్లో సంచలనం రేపుతోంది.

    బ్యాంక్ పత్రాలు
    First published:

    Tags: Bjp, Lok Sabha Election 2019, Telangana, Telangana Lok Sabha Elections 2019, Telangana News, Telangana Politics, TS Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు