గాంధీని అవమానించారు.. సాధ్విని క్షమించేది లేదు: ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్)

Lok Sabha Elections 2019: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ గాంధీని అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు సాధ్విని క్షమించేది లేదని స్పష్టం చేశారు.

  • Share this:
    ఎన్నికల వేళ ప్రధాని నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ అభ్యర్థిపై విరుచుకుపడ్డారు. కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కు మోదీ షాక్ ఇచ్చారు. గాడ్సేపై ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. గాడ్సే గొప్ప దేశభక్తుడు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మహాత్మాగాంధీని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఆమెను క్షమించేది లేదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ఈ ఎన్నికల్లో ఎన్డీయే 300 పైగా సీట్లు సాధిస్తుందని అన్నారు.

    ఇదిలా ఉండగా, నాథూరామ్ గాడ్సే గొప్ప దేశ‌భ‌క్తుడని, ఆయన ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారని, గాడ్సే ఉగ్రవాది అన్న వారికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆమెకు మద్దతుగా కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే, ఓ బీజేపీ నేత కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిపైనా బీజేపీ చర్యలు తీసుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది.
    First published: