వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే పక్షాల నేతలు.. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ రాంవిలాశ్ పాశ్వాన్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం హాజరయ్యారు. మోదీ నామినేషన్ సందర్భంగా ఎన్డీయే పక్షాలన్నీ ఒక్కచోట చేరి తమ బలాన్ని ప్రదర్శించారు. నామినేషన్ వేసేందుకు బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి భారీ ర్యాలీగా వెళ్లారు మోదీ. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మోదీ నామినేషన్ కార్యక్రామానికి ఎన్డీయే పక్షాల నేతలతో పాటు బీజేపీ చీఫ్ అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం సర్వానంద సోనేవాల్, హోమంత్రి రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయెల్, హేమామాలిని, జయప్రద, మనోజ్ తివారి, రవి కిషన్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.
అంతకుముందు హోటల్ డిప్యారిస్లో బీజేపీ కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం
కాలభైరవుడి ఆలయలో ప్రత్యేక పూజలుచేశారు ప్రధాని మోదీ. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్తూ దారి మధ్యలో సర్దార్ వల్లభభాయ్ పటేల్, స్వామి వివేకానంద, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి నేరుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
Before filing my nomination papers, prayed at the temple of Bhagwan Kaal Bhairav, also revered as the Kotwal of Kashi. pic.twitter.com/AuEy9GjHQO
— Chowkidar Narendra Modi (@narendramodi) April 26, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Lok Sabha Election 2019, Pm modi, Uttar Pradesh Lok Sabha Elections 2019, Varanasi S24p77