మోదీపై వారణాసిలో 111 మంది పోటీ.. అంతా ఆ రాష్ట్రం వారే

ప్రధాని మోదీ

‘నరేంద్ర మోదీపై వారణాసిలో 111 మంది రైతులు పోటీచేయాలని నిర్ణయించాం’ అని రైతు సంఘం నాయకుడు అయ్యకన్ను తెలిపారు.

 • Share this:
  రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ గతంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున, వినూత్న నిరసనలు తెలిపిన తమిళనాడు రైతులు ఈ సారి మరో కొత్త పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ సారి బ్యాలెట్ పోరు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానంలో భారీ ఎత్తున నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. ‘నరేంద్ర మోదీపై వారణాసిలో 111 మంది రైతులు పోటీచేయాలని నిర్ణయించాం’ అని రైతు సంఘం నాయకుడు అయ్యకన్ను తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. దక్షిణాది నదుల అనుసంధానం కోసం పోరాడుతున్న రైతు సంఘానికి ఆయన జాతీయ అధ్యక్షుడు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలనేది తమ ప్రధాన డిమాండ్ అని ఆయన చెప్పారు.

  pm modi,narendra modi, vadodara, varanasi, gujarat, ప్రధాని మోదీ, నరేంద్ర మోదీ, వడోదర, గుజరాత్, వారణాసి
  నరేంద్ర మోదీ (File)


  2017వ సంవత్సరంలో ఢిల్లీలో తమిళనాడు రైతులు జరిపిన పోరాటం దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని ఆకర్షించింది. 100 రోజుల పాటు హస్తినలో పోరాటం చేసిన రైతులు వివిధ రూపాల్లో తమ నిరసనలను తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన మరుక్షణం తాము పోటీ నుంచి విరమించుకుంటామని అయ్యకన్ను తెలిపారు. ఒకవేళ బీజేపీ తమ మొర వినకపోతే మోదీపై పోటీ తప్పదని స్పష్టం చేశారు. ఇప్పటికే 300 మంది రైతులకు వారణాసికి రైలు టికెట్లు కూడా బుక్ చేసినట్టు తెలిపారు.

  Pradhan Mantri Kisan Samman Nidhi Scheme, PM-KISAN scheme, PM-KISAN transaction failed, pm kisan samman, pm kisan nidhi, kisan samman yojana, pm kisan list, pm kisan scheme registration, PM KISAN SCHEME Aadhar, PM-Kisan Scheme next installment, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం, పీఎం కిసాన్ స్కీమ్, పీఎం కిసాన్ స్కీమ్ ఆధార్, రైతు బంధు పథకం, పీఎం రైతు బంధు
  ప్రతీకాత్మక చిత్రం


  దేశంలో చాలా పార్టీలు ఉండగా, కేవలం బీజేపీ మేనిఫెస్టోలోనే పెట్టాలని డిమాండ్ చేయడం ఎందుకుని ప్రశ్నించగా, ‘ఎందుకుంటే ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నారు.’ అని తెలిపారు. ‘మేం బీజేపీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకం కాదు. అధికారంలోకి రాకముందు మోదీ మాకు హామీ ఇచ్చారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు.’ అని అయ్యకన్ను గుర్తు చేశారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రైతు రుణమాఫీ చేస్తామని తమ మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు చెప్పారు.

  telangana farmers, farmers protest, nizamabad, millet, police arrested farmers, తెలంగాణ, తెలంగాణ రైతులు, నిజామబాద్, నిజామబాద్‌లో రైతుల ఆందోళన, పసుపు రైతులు, ఎర్రజొన్న రైతులు
  పసుపు, ఎర్రజొన్న రైతులు


  నిజామాబాద్‌లో కూడా రైతులు ఇలాంటి పోరాటాన్నే చేస్తున్నారు. సుమారు వెయ్యి మంది రైతులు టీఆర్ఎస్ అభ్యర్థి కవిత మీద పోటీకి నామినేషన్ వేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో 55 నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు ఖమ్మంలో కూడా సుబాబుల్ రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. అయితే, రైతుల డిమాండ్‌పై స్పందించిన టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత.. నిజామాబాద్‌లో కాదని, అమేథీ, వారణాసిలో నామినేషన్లు వేద్దామని పిలుపునిచ్చారు.
  First published: