వేములవాడ రాజన్నకు బండి సంజయ్ మొక్కులు.. ప్రజలారా మీ కోసం పనిచేస్తానంటూ..

Lok Sabha Elections 2019: కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేదల కోసం పని చేస్తానని బండి సంజయ్ అన్నారు. మద్దతిచ్చిన అందరికీ రుణపడి ఉంటానని, పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని వెల్లడించారు.

news18-telugu
Updated: May 24, 2019, 11:20 AM IST
వేములవాడ రాజన్నకు బండి సంజయ్ మొక్కులు.. ప్రజలారా మీ కోసం పనిచేస్తానంటూ..
బండి సంజయ్‌కు రాజరాజేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని అందజేస్తున్న ఆలయ అధికారులు
  • Share this:
తెలంగాణలో బీజేపీకి నాలుగు సీట్లు.. గెలిచిన నాలుగు సీట్లకు ఒక్కో ప్రత్యేకత. ఒకటి సెంటిమెంటు సీటు అయితే మరోటి ముఖ్యమంత్రి కూతురిని ఓడించిన సీటు, ఇంకోటి అసలు గెలవదు అనుకున్న సీటు. ఇక, అన్నింటికి మించి కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన బండి సంజయ్.. యువతే ప్రధాన బలంతో రంగంలోకి దిగారు. ఒక విధంగా చెప్పాలంటే సంజయ్ కంటే స్వచ్ఛందంగా కదిలివచ్చిన యువతే ఆయన గెలుపు కోసం ఎక్కువ కష్టపడ్డారంటే అతిశయోక్తి కాదు. ప్రచారం ముగిసే చివరి రోజు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరడం.. ప్రజల్లో సానుభూతి కూడా కలిసి వచ్చింది. ఫలితంగా నిన్న వెలువడిన రిజల్ట్స్‌లో జయకేతనం ఎగురవేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌పై సుమారు 90వేల మెజారిటీతో గెలుపొందారు.

గెలిచిన అనంతరం బండి సంజయ్ విజయ సంకేతం


కాగా, ఎంపీగా గెలిచిన సందర్భంగా ఆయన దక్షిణ కాశీ వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్డీయే తరఫున 351 మంది గెలవడంతో 351 కోడెలను కట్టి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేదల కోసం పని చేస్తానని అన్నారు. మద్దతిచ్చిన అందరికీ రుణపడి ఉంటానని, పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని వెల్లడించారు. రాజన్న ఆశీస్సులతో గెలిచానని , రాజకీయాలకు అతీతంగా ఆలయ అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు బీజేపీ ఇచ్చిన బీ-ఫాం రాజన్న దగ్గర పెట్టి, ఆయన మీద భారం వేశానని, ఆయన ఆశీస్సులు అందాయని సంతోషం వ్యక్తం చేశారు.

First published: May 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు