రాహుల్ ఎఫెక్ట్.. కేరళలో యూడీఎఫ్ క్లీన్‌స్వీప్..!

రాహుల్ గాంధీ (ఫైల్)

Lok Sabha Elections 2019: కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ క్లీన్ స్వీప్ దిశగా దూసువెళ్తోంది. 20 లోక్‌సభ స్థానాలకు గాను 19 సీట్లలో హస్తం పార్టీ లీడింగ్‌లో ఉంది.

  • Share this:
    దేశమంతా కాషాయ గాలి వీస్తుంటే.. కేరళలో మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలు వస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ క్లీన్ స్వీప్ దిశగా దూసువెళ్తోంది. 20 లోక్‌సభ స్థానాలకు గాను 19 సీట్లలో హస్తం పార్టీ లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తిరువనంతపురంలో శశిథరూర్ ఆధిక్యంలో ఉన్నారు. తొలుత బీజేపీ అభ్యర్థి రాజశేఖర్ కుమ్మనం కంటే వెనుకబడినా ఆ తర్వాత లీడింగ్‌లోకి వచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ శశిథరూర్ కౌంటింగ్ ప్రారంభంలో బీజేపీ అభ్యర్థి ఓ.రాజగోపాల్‌పై వెనుకబడినా ఆ తర్వాత ఆధిక్యం కొనసాగించి గెలుపు సాధించారు. అయితే, శబరిమల ప్రభావం బీజేపీకి ఏ మాత్రం కలిసి రాలేదు. అక్కడ ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేని స్థితిలో ఉంది.

    మరోవైపు, లెఫ్ట్‌కు కంచుకోటగా ఉన్న కేరళలో తాజా ఫలితాలు ఎల్డీఎఫ్‌కు షాక్‌కు గురిచేశాయి. 2014 ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌కు 8 సీట్లు రాగా, యూడీఎఫ్‌కు 12 సీట్లు వచ్చాయి. అయితే, ఈ సారి దాదాపు అన్ని సీట్లను యూడీఎఫ్ కైవసం చేసుకోనుంది. ఒకే ఒక్క సీటు‌లో ఎల్డీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతోంది. త్రిపుర, పశ్చిమబెంగాల్ కంచుకోటలను చేజార్చుకున్న సీపీఎం ప్రస్తుతం కేరళలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.
    First published: