మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు.. దాదాపు అన్ని ఛానెళ్ల ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేదే అధికారం అని తేల్చేశాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమి కావల్సినంత మెజారిటీ సాధిస్తుందని చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మరోసారి అధికారం దూరం అవుతుందని ఘోషిస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారం ఏచూరి భేటీ అయ్యారు. ఫలితాలు వెలువడ్డాక అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. బీజేపీకి సరిపడా సీట్లు రాకపోతే ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు, తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితోనూ సీతారాం ఏచూరి భేటీ అయ్యారు.
ఇదిలా ఉండగా, చంద్రబాబు.. రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్, మాయావతి, శరద్ పవార్, సుధాకర్ రెడ్డి, శరద్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్‌తోనూ భేటీ అయ్యారు. బీజేపీకి తక్కువ సీట్లు వస్తే ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.