దేశచరిత్రలో మొట్టమొదటిసారిగా ఒకే తలతో పుట్టిన అవిభక్త కవలలు వేర్వేరుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని పట్నా ప్రాంతానికి చెందిన సబా, ఫరాహ్ తలలు అతుక్కుని జన్మించారు. వైద్యులు వీరి తలలను వేరు చేసేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. వీరికి ఇప్పుడు 19 ఏళ్లు. పట్నా నగరంలోని సమన్ పురా ఏరియాకు చెందిన సబా- ఫరాహ్ అక్కాచెల్లెలు... బీహార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే తలలు అతుక్కుని జన్మించిన వీరిని ఒకే వ్యక్తిగా పరిగణిస్తూ ఒకే ఓటర్ గుర్తింపు కార్డు జారీ చేసింది ఎన్నికల సంఘం. అయితే శారీరకంగా కలిసి ఉన్నంత మాత్రన ఒకే వ్యక్తి కాదని, ఇలా ఇద్దరికి ఒకే గుర్తింపు కార్డు జారీ చేయడం సరికాదని భావించిన పట్నా జిల్లా కలెక్టర్ కుమార్ రవి... ప్రత్యేకంగా స్పందించి వేర్వేరుగా గుర్తింపు కార్డులు జారీ చేయించారు. నిజానికి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒకరు ఓటు వేస్తుంటే, మరొకరు చూడకూడదు. ఎవరికి ఓటు వేశారో కూడా చెప్పకూడదు. అయితే అవిభక్త కవలలకు ఈ నిబంధనలు వర్తించవు. శరీరాలు వేరైనా తల కలిసి ఉండడంతో ఈ నిబంధనను సవరిస్తూ... సబా, ఫరాహ్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు.
సబా, ఫరాహ్ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్కు వీరాభిమానులు. వీరి గురించి తెలుసుకున్న ఆయన... ఈ అవిభక్త అక్కాచెల్లెళ్లను ముంబాయికి పిలిపించుకుని రాఖీ కట్టించుకున్నారు.
Published by:Ramu Chinthakindhi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.