Secunderabad Lok Sabha: 1991 నుంచీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ

సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క నాంపల్లి తప్ప అన్నింటిలోనూ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించిన అంబర్ పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్ స్థానాలను సైతం తాజాగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.

news18-telugu
Updated: March 29, 2019, 6:03 PM IST
Secunderabad Lok Sabha: 1991 నుంచీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థులు
  • Share this:
జంటనగరాల్లో ఒకటిగా ఉన్న సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ దేశరాజకీయ చరిత్రలో విశిష్టమైన స్థానం ఉంది. భిన్నమైన రాజకీయ పరిస్థితులతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ సైతం ఇక్కడ పట్టు పెంచుకుంది. 1990 వరకు కాంగ్రెస్ హవా కొనసాగినా..అనంతరం బీజేపీ  బలం పెంచుకుంది. ఆ తర్వాత నువ్వా..నేనా అన్నట్లుగా ఇరు పార్టీల మధ్య విజయం దోబూచులాడుతూ వస్తోంది.

ప్రస్తుతం సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున అంజన్ కుమార్ యాదవ్, టీఆర్ఎస్ తరపున సాయికిరణ్ యాదవ్, బీజేపీ తరపున కిషన్ రెడ్డి పోటీచేస్తున్నారు. ఇక జనసేన సైతం తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆ పార్టీ తరపున నేమూరి శంకర్‌ గౌడ్‌ బరిలో దిగుతున్నారు.

తలసాని సాయికిరణ్ యాదవ్


సికింద్రాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 17,40,000 ఓటర్లు ఉన్నారు. అందులో 10,12,378 మంది పురుషులు కాగా, 7,27,622 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ముషీరాబాద్, అంబర్ పేట, ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.


2014లో బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా పోటీలో నిలిచిన బండారు దత్తాత్రేయ.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్‌పై 2,54,735 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంతకు ముందుకు వరుసగా 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించిన అంజన్ కుమార్ యాదవ్.. గత ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో అంజన్ కుమార్ సమీప బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయపై 1, 70, 167 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

అంజన్ కుమార్ యాదవ్
సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క నాంపల్లి తప్ప అన్నింటిలోనూ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించిన అంబర్ పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్ స్థానాలను సైతం తాజాగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ముందులా లేదు. ఈసారి కాంగ్రెస్, బీజేపీలు కాకుండా.. టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ రేసులో ముందుండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇప్పటి వరకూ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నిల వివరాలు:





















































1957-62 అహ్మద్ మొహియుద్దీన్ కాంగ్రెస్
1962-67 అహ్మద్ మొహియుద్దీన్ కాంగ్రెస్
1967-71 బకర్ అలీ మీర్జా కాంగ్రెస్
1971-77 ఎం.ఎం.హషీమ్ తెలంగాణా ప్రజా సమితి
1977-80 ఎం.ఎం.హషీమ్ కాంగ్రెస్
1980-84 పి.శివశంకర్ కాంగ్రెస్
1984-89 టంగుటూరి అంజయ్య కాంగ్రెస్
1989-91 టంగుటూరి మణెమ్మ కాంగ్రెస్
1991-96 బండారు దత్తాత్రేయ బీజేపీ
1996-98 పి.వి.రాజేశ్వరరావు కాంగ్రెస్


































1998-99 బండారు దత్తాత్రేయ బీజేపీ
1999-04 బండారు దత్తాత్రేయ బీజేపీ
2004-09 ఎం.అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్
2009-14 ఎం. అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్
2014-ప్రస్తుతం   బండారు దత్తాత్రేయ బీజేపీ
Published by: Shiva Kumar Addula
First published: March 25, 2019, 9:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading