బిర్యానీ కోసం కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు..తీవ్ర ఉద్రిక్తత

ముందస్తు అనుమతి లేనిదే విందు ఏర్పాటుచేసినందుకు కేసులు పెట్టారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే జమీల్, అతని కుమారుడుతో పాటు మొత్తం 34 మంది కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

news18-telugu
Updated: April 7, 2019, 1:40 PM IST
బిర్యానీ కోసం కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు..తీవ్ర ఉద్రిక్తత
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 7, 2019, 1:40 PM IST
అసలే ఇది ఎన్నికల సీజన్..! పార్టీల ప్రచారంలో బిర్యానీ ప్యాకెట్స్, మద్యం బాటిళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రచారానికి వచ్చే జనాలకు డబ్బులతో పాటు బిర్యానీ, మద్యం ఆఫర్ చేస్తున్నారు నేతలు. ఐతే ఒక్కోసారి ఇవే గొడవలకు కారణమవుతున్నాయి. భోజనం, మందు కోసం గొడవలు కూడా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనే జరిగింది. బిర్యానీ కోసం కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఐతే అనుమతి లేకుండా బిర్యానీ విందు ఏర్పాటుచేయడంపై ఎన్నికలు అధికారులు కేసునమోదు చేశారు.

బిజ్నోర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవాజుద్దీన్ సిద్దిఖీకి మద్దతుగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. కాక్రోలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని టధేడా గ్రామంలో ఎమ్మెల్యే మౌలానా జమీల్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. సభ అనంతరం అక్కడే విందు ఏర్పాటుచేశారు. విందులో బిర్యానీ పెట్టడడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఎగబడ్డారు కార్యకర్తలు. ముందుగా తినేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో కొందరి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణ చెలరేగింది. అనంతరం పరస్పరం కొట్టుకున్నారు. ప్లేట్లు, కుర్చీలతో దాడులు చేసుకున్నారు. పోలీసులు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.

కాగా, ఈ ఘటనను ఎన్నికల అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ముందస్తు అనుమతి లేనిదే విందు ఏర్పాటుచేసినందుకు కేసులు పెట్టారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే జమీల్, అతని కుమారుడుతో పాటు మొత్తం 34 మంది కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనతో టధేడా గ్రామంలో అదనపు బలగాలను తరలించి పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన జమీల్..ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక బిజ్నోర్ లోక్‌సభ నియోజకవర్గంలో తొలి విడతలో భాగంగా ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది.

First published: April 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...