Lok Sabha Elections 2019: ఎండలు మండుతున్నా ఓటర్లు లెక్క చేయలేదు..

ప్రతీకాత్మక చిత్రం

Lok Sabha Elections 2019: 2014తో పోల్చుకుంటే 2019లో ఓటింగ్ శాతం పెరిగిందని, ఆరు విడతల వరకు 67.37 శాతం పోలింగ్ నమోదైందని సీఈసీ సునీల్ అరోరా వెల్లడించారు.

  • Share this:
    ప్రజాస్వామ్య పండుగ ఘనంగా సాగింది. ఏప్రిల్ 11 నుంచి ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు, తెలంగాణ‌లో లోక్‌సభ ఎన్నికలు తొలి విడతలో(ఏప్రిల్ 11న) ఒకేసారి జరిగాయి. 11 ఏప్రిల్ -20 రాష్ట్రాల్లోని 91 నియోజకవర్గాల్లో మొదటి విడత ఎన్నికలు, 18 ఏప్రిల్- 13 రాష్ట్రాల్లోని 97 నియోజకవర్గాల్లో రెండో విడత ఎన్నికలు, 23 ఏప్రిల్- 14 రాష్ట్రాల్లోని 115 నియోజకవర్గాల్లో మూడో విడత ఎన్నికలు, 29 ఏప్రిల్- 9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో నాలుగో విడత ఎన్నికలు, 6 మే- 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాల్లో ఐదో విడత ఎన్నికలు, 12 మే -7 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆరో విడత ఎన్నికలు, ఈ రోజు 8 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఏడో విడత ఎన్నికలు జరిగాయి. అయితే, ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా మీడియాతో మాట్లాడారు. 2014తో పోల్చుకుంటే 2019లో ఓటింగ్ శాతం పెరిగిందని, ఆరు విడతల వరకు 67.37 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. ఎండలు మండుతున్నా లెక్కచేయకుండా ఓటర్లు ఓటు హక్కను వినియోగించుకున్నారని అన్నారు.

    ఎన్నికల్లో పాల్గొన్న సీనియర సిటెజన్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహిళల ఓటింగ్ శాతం కూడా బాగా పెరిగిందని వివరించారు. కాగా, 2014 ఎన్నికల నాటితో పోలిస్తే ఈ సారి లక్ష పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. 10 లక్షల పోలింగ్ కేంద్రాల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి 12 రకాల గుర్తింపు కార్డులను అనుమతించిన విషయం తెలిసిందే.
    First published: