news18-telugu
Updated: May 23, 2019, 10:47 AM IST
సీఎంఎస్ అంచనా ప్రకారం ఎన్నికల ఖర్చులో బీజేపీదే.
ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తూ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ హవా కొనసాగిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించిన కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో నిరాశే ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తిరిగి పుంజుకొన్నది. రాజస్థాన్‌లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గానూ బీజేపీ ప్రస్తుతం 24 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. రాజస్థాన్‌లో ఏప్రిల్ 29, మే 6న ఎన్నికల పోలింగ్ జరిగింది. జాతీయ ఎన్నికలలో రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. ఈ దఫా రాజస్థాన్‌లో ఎలాగైనా పట్టు సాధించాలని కాంగ్రెస్ చాలా ప్రయత్నం చేసింది. మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లోనూ 11 సీట్లకు 10 సీట్లలో, మధ్యప్రదేశ్‌లోనూ మెజారిటీ సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇక మొత్తంగా ఎన్డీయే 343 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా, 287 సీట్లలో బీజేపీ లీడ్‌లో ఉంది. యూపీఏ 89 సీట్లలో లీడింగ్‌లో ఉంది.
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గంలో ప్రధాని మోదీ 65వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో అమిత్ షా 50వేల ఓట్ల లీడ్‌లో ఉన్నారు.
First published:
May 23, 2019, 10:47 AM IST