తెలంగాణ పోలింగ్ శాతంలో మెదక్ టాప్, సికింద్రబాద్ లాస్ట్

రజత్ కుమార్ (ఫైల్)

అత్యధికంగా మెదక్‌లో 68.60 శాతం, అత్యల్పంగా సికింద్రాబాద్‌లో 39.20 శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు.

 • Share this:
  తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల సమయానికి 61 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్‌లో 68.60 శాతం, అత్యల్పంగా సికింద్రాబాద్‌లో 39.20 శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్‌తో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఆరుగంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించామని, పూర్తిస్థాయి పోలింగ్ శాతం రావడానికి కొంత సమయం పడుతుందని రజత్ కుమార్ తెలిపారు.

  జహీరాబాద్ 67.8 శాతం
  మెదక్ 68.6 శాతం
  మల్కాజ్‌గిరి 42.75 శాతం
  సికింద్రాబాద్ 39.20 శాతం
  హైదరాబాద్ 39.49 శాతం
  చేవెళ్ల 53.8శాతం
  మహబూబ్‌నగర్ 64.99శాతం
  నాగర్ కర్నూల్ 57.12 శాతం
  నల్లగొండ 66.11 శాతం
  భువనగిరి 68.25 శాతం
  వరంగల్ 60శాతం
  మహబూబాబాద్ 59.99శాతం
  ఖమ్మం 67.96
  ఆదిలాబాద్ 66.67 శాతం
  నిజామాబాద్ 52 శాతం

  ఏపీ ఇంటర్ రిజల్ట్స్ ఇక్కడ చూడండి

  First published: