Lok Sabha Elections: పెళ్లికి వెళ్తే ఎన్నికల ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తారట..

ఎక్కడ చూసినా ఎన్నికలు, ఫలితాల మీదే చర్చ. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అందరికీ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. అయితే, ఆ ఫీవర్ పెళ్లిళ్లకు కూడా పట్టుకుంది.

news18-telugu
Updated: May 13, 2019, 8:56 AM IST
Lok Sabha Elections: పెళ్లికి వెళ్తే ఎన్నికల ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తారట..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మే 23.. ఈ రోజు కోసం వేలాది మంది అభ్యర్థులు, లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు లోక్‌సభ, పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి కాబట్టి. తమ పార్టీ గెలుస్తుందంటే.. తమ పార్టీదే అధికారం అని నేతలు చెబుతున్నారు. ఎక్కడ చూసినా ఎన్నికలు, ఫలితాల మీదే చర్చ. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అందరికీ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. అయితే, ఆ ఫీవర్ పెళ్లిళ్లకు కూడా పట్టుకుంది. ఎంతలా అంటే.. పెళ్లికి వస్తే ఎన్నికల ఫలితాల కోసం లైవ్ టీవీ ఏర్పాటు చేస్తామని చెప్పేంత. వివరాల్లోకెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుకు చెందిన ఓ దుస్తుల దుకాణం యజమాని బయ్యా వాసు తన కుమార్తె వివాహాన్ని ఈ నెల 23న ఉదయం 11.51 గంటలకు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పెళ్లికి వచ్చే బంధువుల సంఖ్య తగ్గుతుందన్న భయమో.. లేక కాస్త వెరైటీగా పెళ్లి చేస్తే బాగుంటుందనో గానీ.. ఆయనీ వినూత్న ఆలోచన చేశారు. పైగా, తలపాక సెట్టింగులో వధూవరులను తీసుకొస్తామని, చుట్టాలకు అప్సరసలు ఆహ్వానం పలుకుతారని పెళ్లి కార్డులో ప్రింట్ చేయించాడు.

పెళ్లి మంటపంలోనే ఎన్నికల ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పటంతో ఈ పెళ్లిపై ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. రిజల్ట్స్ ఫీవర్ వీరికి కూడా పట్టుకుంది అంటూ జోక్స్ వేసుకుంటున్నారు. ఏదేమైనా ఒకే చోట పెళ్లి, ఎన్నికల ఫలితాలు చూసేందుకు వీలు ఉండనుంది. అక్కడే హాయిగా భోజనం కూడా చేసేయొచ్చు.

First published: May 13, 2019, 8:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading