LOK SABHA ELECTION RESULTS 2019 ITS A NEW MORNING FOR AMETHI SAYS SMRITI IRANI
Smriti Irani: అమేథీకి నవోదయం: స్మృతి ఇరానీ
స్మృతి ఇరానీ
Lok Sabha Election Results 2019 | గత 39 ఏళ్లుగా నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోటలా ఉంటున్న అమేథీలో రాహుల్ గాంధీపై విజయం సాధించడం పట్ల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సంతోషం వ్యక్తంచేశారు.
రాహుల్ గాంధీని ఆయన సొంత నియోజకవర్గం అమేథీలో మట్టికరిపిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పుపై బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సంతోషం వ్యక్తంచేశారు. రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ 55,120 ఓట్ల తేడాతో వియం సాధించారు. రాహుల్ గాంధీకి 4,13,394 ఓట్లు (43.9శాతం) దక్కగా...స్మృతి ఇరానీకి 4,68,514 ఓట్లు(49.7శాతం) పోలయ్యాయి.
అమేథీ నియోజకవర్గం నెహ్రూ-గాంధీ కుటుంబానికి గత 39 ఏళ్లుగా కంచుకోటలా ఉంటోంది. 1980 నుంచి సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వరుసగా ఆరు పర్యాయాలు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. స్వయంగా రాహుల్ గాంధీ 2004 నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేసిన స్మృతి ఇరానీ 1,07,903 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి స్మృతి ఇరానీ గత ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు.
అమేథీలో రాహుల్ని మట్టికరిపించిన స్మృతి ఇరానీ
అమేథీలో విజయంపై సంతోషం వ్యక్తంచేసిన స్మృతి ఇరానీ...అమేథీకి నవోదయం అంటూ శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు. అమేథీ ప్రజల నవసంక్పాలనికి ఇది కొత్త ఉదయం అంటూ పేర్కొన్నారు. అభివృద్ధిపై విశ్వాసముంచి కమలవికాసానికి తోడ్పడిన మీకందరికీ ధన్యవాదాలంటూ ట్వీట్లో పేర్కొన్నారు.
एक नयी सुबह अमेठी के लिए , एक नया संकल्प। धन्यवाद अमेठी 🙏शत शत नमन । आपने विकास पर विश्वास जताया, कमल का फूल खिलाया। अमेठी का आभार #PhirEkBaarModiSarkaar#VijayiBharat
రాహుల్ గాంధీ అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. ఇక్కడ 4,31,440 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.