Election Result 2019 Updates: తమిళనాడులో డీఎంకే కూటమి లీడింగ్... 32 స్థానాల్లో ఆధిక్యత

Lok Sabha Election Result 2019 Updates | మొత్తం 39 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఎన్నికల్లో ధనప్రవాహం కారణంగా వేలూరులో పోలింగ్ రద్దు చేసింది ఎన్నికల కమిషన్.

news18-telugu
Updated: May 23, 2019, 10:17 AM IST
Election Result 2019 Updates: తమిళనాడులో డీఎంకే కూటమి లీడింగ్... 32 స్థానాల్లో ఆధిక్యత
Election Result 2019 Updates: తమిళనాడులో డీఎంకే కూటమి లీడింగ్... 32 స్థానాల్లో ఆధిక్యత (File Photo డీఎంకే నేత స్టాలిన్)
news18-telugu
Updated: May 23, 2019, 10:17 AM IST
లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది. మొత్తం 38 స్థానాల్లో డీఎంకే కూటమి 32 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి రెండు స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది. చెన్నై సెంట్రల్‌లో దయానిధి మారన్, కన్యాకుమారిలో కాంగ్రెస్ అభ్యర్థి వసంతకుమార్ ఆధిక్యంలో ఉన్నారు. కొయంబత్తూరు లోక్‌సభ స్థానంలో బీజేపీ ఆధిక్యం చూపిస్తోంది. మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం లీడ్‌లో ఉన్నారు. తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఎన్నికల్లో ధనప్రవాహం కారణంగా వేలూరులో పోలింగ్ రద్దు చేసింది ఎన్నికల కమిషన్.

ఇక తమిళనాడులో 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల ఫలితాలు ఇ.పళనిస్వామి, ఓ.పన్నీర్ సెల్వమ్ నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వ భవితవ్యాన్ని తేల్చనుంది. ఉపఎన్నికల్లోనూ డీఎంకే ఆధిక్యం చూపిస్తోంది. 8 స్థానాల్లో డీఎంకే ఆధిక్యంలో ఉండగా, 5 స్థానాల్లో అన్నాడీఎంకే ఆధిక్యంలో ఉంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 అసెంబ్లీనియోజకవర్గాలున్నాయి. అన్నాడీఎంకేకు 114 మంది సభ్యుల బలం ఉంది. డీఎంకేకు 88 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌కు 8, ఇతరులు ఇద్దరు ఉన్నారు. డీఎంకే మొత్తం 22 స్థానాలను గెలుచుకుంటే అన్నాడీఎంకే ప్రభుత్వం చిక్కుల్లో పడే అవకాశముంది.

నెహ్రూ నుంచి మోదీ వరకు... ఎవరేం చదివారో తెలుసుకోండి




ఇవి కూడా చదవండి:

Lok Sabha Election Result 2019: ఫలితాల్లో ఎన్డీఏ లీడింగ్... దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

Aadhaar: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? మార్చేయండి ఇలా...
Loading...
IRCTC: రైలులో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? జాగ్రత్త అంటున్న ఐఆర్‌సీటీసీ
First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...