వాకింగ్...యోగా చేసి నామినేషన్ వేసిన కేంద్రమంత్రి

రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్

రాందేవ్ బాబా మాట్లాడుతూ ప్రాణాయామం చేసి నామినేషన్ వేస్తే... ఎవరూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయరంటూ సరదాగా అన్నారు.

  • Share this:
    దేశవ్యాప్తంగా ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఎక్కడా చూసిన నేతల ప్రచార, నామినేషన్ల హడావుడి కనిపిస్తోంది. రాజస్థాన్‌లో కూడా ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మంగళవారం జైపూర్‌లో నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ వేయడానికి ముందు ఆయన వాకింగ్ చేశారు. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సూచనతో అరకిలోమీటర్ నడిచారు. ఆ తర్వాత ఆయనతో కలిసి ప్రాణాయామం చేశారు. అనంతరం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాందేవ్ బాబా మాట్లాడుతూ ప్రాణాయామం చేసి నామినేషన్ వేస్తే... ఎవరూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయరంటూ సరదాగా అన్నారు. రాజకీయాల్లో దిగేవారికి యోగా చాల అవసరమన్నారు రాందేవ్ బాబా. ప్రజలు యోగా చేయకపోవడమే రాజకీయ అస్థిరతకు కారణమన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాథోడ్ మీడియాతో మాట్లాడారు. దశాబ్దాలుగా సరైనా ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే దేశం అభివృద్ధి చెందలేదన్నారు రాథోడ్. ప్రస్తుతం దేశం సరైన నాయకుడి చేతిలో ఉందన్నారు రాథోడ్.

    రాజస్థాన్‌లో రెండు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 29,మే 6న రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నాల్గవ విడతలో భాగంగా ఏప్రిల్ 29న ఎన్నికలు జరగనున్నాయి. ఫేజ్ 5లో మే6న 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. 2014 ఎన్నికల్లో రాజస్థాన్‌లో బీజేపీ గెలిచింది. 25 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంది.    First published: