ఆయనకు భూములతో ప్రత్యేక అనుబంధం...ప్రియాంక గాంధీ భర్తపై స్మృతి ఇరానీ సెటైర్లు...

Lok Sabha Election 2019: రాబర్ట్ వాద్రాకు భూములతో ప్రత్యేక అనుసంబంధముందని, కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం కోసం ఆయన వచ్చేటప్పుడు భూ యజమానులు అప్రమత్తంగా ఉండాలని స్మృతి ఇరానీ సూచించారు.

news18-telugu
Updated: April 7, 2019, 8:23 PM IST
ఆయనకు భూములతో ప్రత్యేక అనుబంధం...ప్రియాంక గాంధీ భర్తపై స్మృతి ఇరానీ సెటైర్లు...
టీవీ నటిగా పాపులర్ అయిన తర్వాత బీజేపీలో జాయిన్ అయి మోడీ మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అమేథిలో రాహుల్ గాంధీపై మరోసారి పోటీ చేస్తూ వార్తల్లో నిలిచారు.
  • Share this:
కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా దేశ వ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు ప్రకటించిన ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సెటైర్లు విసిరారు. రాబర్ట్ వాద్రా పర్యటించే ప్రాంతాల్లో నివాసముంటే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని...రాబర్ట్ వాద్రా కళ్లు మీ భూములపై పడకుండా చూసుకోవాలని సూచించారు. రాబర్ట్ వాద్రాకు భూములతో ప్రత్యేక అనుబంధం ఉందని ఎద్దేవా చేశారు. భూముల యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  రాబర్ట్ వాద్రా భూ అక్రమాల కేసులను ఎదుర్కొంటుండడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేయనున్నట్లు రాబర్ట్ వాద్రా తెలిపారు. అమేథీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ ఈ నెల 10న నామినేషన్ దాఖలు చేయనుండగా...సోనియాగాంధీ రాయ్‌బరేలీ నుంచి ఈ నెల 11న నామినేషన్ సమర్పిస్తారు. అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలకు ఐదో విడతలో మే 6న పోలింగ్ జరగనుంది.

అమేథీలో రాహుల్ గాంధీపై బీజేపీ అభ్యర్థిగా స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు 2014లోనూ ఇక్కడ రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఎన్నికల్లో రాహుల్ గాంధీతో అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు.
Published by: Janardhan V
First published: April 7, 2019, 8:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading