news18-telugu
Updated: May 23, 2019, 11:10 PM IST
రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ
కాంగ్రెస్ కంచుకోట బద్ధలయింది. అమేథీలో ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ను ఓడించి చరిత్ర సృష్టించారు స్మృతి ఇరానీ. 47,558 ఓట్ల మెజార్టీతో రాహుల్ గాంధీపై ఆమె విజయం సాధించారు. స్మృతి ఇరానీకి 3,78,863 ఓట్లు పోలవ్వగా... రాహుల్ గాంధీకి 3,31,305 ఓట్లు పడ్డాయి. ఓట్ల శాతం పరంగా స్మతి ఇరానీకి 49.9శాతం ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 50 శాతం మంది ప్రజలు స్మృతి ఇరానీకి జైకొట్టారు. ఇక రాహుల్ గాంధీకి 43.6 శాతం మంది మద్దతు తెలిపారు.
దశాబ్ధాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది అమేథీ. అక్కడి నుంచి గతంలో రాహుల్ తల్లిదండ్రులు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. 1967 నుంచి 2014 వరకు అమేథీలో 15 సార్లు ఎన్నికలు జరగ్గా 13 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 1977లో జనతా పార్టీ, 1998లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. మళ్లీ ఇన్నాళ్లకు అమేథీలో కాంగ్రెసేతర అభ్యర్థి విజయం సాధించారు. 2014లోనూ స్మతి ఇరానీ, రాహుల్ గాంధీ తలపడ్డారు. ఆ ఎన్నికల్లో రాహుల్ గాంధీ దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.
లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీచేశారు. అమేథీతో పాటు వయనాడ్ (కేరళ)లోనూ బరిలో దిగారు. అమేథీలో ఓటమి పాలవగా వయనాడ్‌లో మాత్రం భారీ మెజార్టీతో విజయం సాదించారు. సీపీఐ అభ్యర్థి పీ.పీ.సునీర్‌పై 4,31,770 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Wayanad | 4 |
Rahul Gandhi |
Indian National Congress |
i |
|
PP. Suneer |
Communist Party of India |
i |
|
431770 |