LOK SABHA ELECTION 2019 RESULT SUMALATHA AMBARISH WIN HISTORICAL VICTORY IN MANDYA LOK SABHA SEAT IN KARNATAKA TA
Lok Sabha Election 2019 Result: 52 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన సుమలత.. ‘మాండ్యా’లో అనూహ్య విజయం..
సుమలత (File)
మన దగ్గర సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఈ 2019 ఎన్నికల్లో జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో మంది సినీ నటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్యా లోక్‌సభ స్థానంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో సుమలత అంబరీష్ భారీ విజయాన్ని నమోదు చేసారు.
మన దగ్గర సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఈ 2019 ఎన్నికల్లో జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో మంది సినీ నటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్యా లోక్‌సభ స్థానంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ స్థానంలో ప్రముఖ నటుడు కాంగ్రెస్ నేత అంబరీష్ మరణంతో ఆయన భార్య సుమలత కాంగ్రెస్ తరుపున పోటీ చేయాలనుకుంది. కానీ కాంగ్రెస్ ఈ సీటు మిత్రపక్షం జేడీఎస్‌కు కేటాయించడంతో సుమలత ఇక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో స్వతంత్య్ర అభ్యర్ధిగా ఎన్నికల్లో నిలబడింది. సుమలతకు పోటీగా కాంగ్రెస్, జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ప్రధాని దేవగౌడ మనవడు.. కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేయడంతో పోరు రసవత్తరంగా మారింది. ఐతే ఈ ఎన్నికల్లో సుమలత మరో సినీ నటుడు నిఖిల్ పై సుమలత ఘన విజయం సాధించారు.
కర్ణాటకలోని ‘మాండ్యా’ లోక్‌సభ నుంచి స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేసిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుమలత
మాండ్య ఎన్నికల్లో ఒక్కళిగల ప్రభావం ఎక్కువగా ఉంది. సమలత భర్తది ఒక్కలిగ సామాజిక వర్గం కావడంతో ఆమెకు కలిశొచ్చింది. అంతేకాదు ఇక్కడ బీజేపీ తన అభర్ధిని నిలబెట్టలేదు. అంతేకాదు ఆమె విజయానికి నైతిక మద్దతు ఇచ్చారు. దేశ వ్యాప్తంగా అందిరి దృష్టిని ఆకర్షించిన మాండ్యా లోక్‌సభ సీటులో గెలిచి ఆమె పార్లమెంటులో అడుగుపెట్టబోతుంది. అంతేకాదు కర్ణాటక చరిత్రలో 52 ఏళ్ల తర్వాత మాండ్య నుంచి లోక్‌సభకు వెళుతున్న తొలి స్వతంత్య్ర మహిళ అభ్యర్ధిగా సుమలత రికార్డు క్రియేట్ చేసారు. ఇక ఇదే కర్ణాటకలో స్వతంత్య్ర అభ్యర్థిగా బెంగుళూరు సెంట్రల్ నుంచి పోటీ చేసిన ప్రకాష్ రాజ్ కనీసం ప్రత్యర్థులకు పోటీ కూడా ఇవ్వలేకపోయాడు. మొత్తానికి సెంటిమెంట్‌తో సుమలత పార్లమెంటు ఎన్నికల్లో గెలిస్తే.. ప్రకాష్ రాజ్ మాత్రం కనీసం పోటీ ఇవ్వలేక పోయారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.