Lok Sabha Election 2019 Result: లోక్‌సభ ఎన్నికల్లో సినీ ప్రముఖుల భవితవ్యం..

సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స్పష్టమైన మెజారీటీ దిశగా దూసుకుపోతుంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు పోటా పోటీగా సినీ నటులను ఎన్నికల బరిలో నిలిపాయి.వీరిలో ఎవరెవరు లీడ్‌లో ఉన్నారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 23, 2019, 11:54 AM IST
Lok Sabha Election 2019 Result: లోక్‌సభ ఎన్నికల్లో సినీ ప్రముఖుల భవితవ్యం..
ఊర్మిళ,శతృఘ్న సిన్హా,సన్ని డియోల్,రవికిషన్ శుక్లా
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 23, 2019, 11:54 AM IST
వీరిలో కాంగ్రెెస్ విషయానికొస్తే.. మహారాష్ట్రలోని ముంబాయి నార్త్ నియోజకవర్గంలో వెనకంజలో ఉంది. ఇక మహారాష్ట్ర విషయానికొస్తే.. అక్కడ బీజేపీ, శివసేన కూటమి 48 సీట్లలో 40 సీట్లకు పైగా ఆధిక్యత కొనసాగిస్తోంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికల ముందర బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన శతృఘ్న సిన్హా పాట్నా సాహిబ్‌లో వెనకంజలో ఉన్నారు. అటు శతృఘ్న సిన్హా భార్య పూనమ్ సిన్హా కూడా లక్నోలో ఎస్పీ తరుపున కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. మరోవైపు చంఢీఘడ్‌ నుంచి సినీ నటి కిరణ్ ఖేర్‌తో పాటు.. ఇక యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేసిన ప్రముఖ సినీ నటుడు రేసుగుర్రం విలన్.. రవి కిషన్ శుక్లా..లీడ్‌లో ఉన్నాడు. యూపీలోని మథుర నుంచి ఒకప్పటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమా మాలిని, ఆమె సవతి కొడుకు సన్ని డియోల్ పంజాబ్ లోని గురుదాస్ పూర్ నుంచి బీజేపీ తరుపున ముందంజలో ఉన్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌ నుంచి  అసన్‌సోల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన సినీ నటుడు బాబుల్ సుప్రియో కూడా లీడ్‌లో కొనసాగుతున్నారు.

Lok Sabha Election 2019 Result: jaya prada trailing in rampur, sumalatha leading in mandya,election results 2019,live election result 2019,sumalatha mandya,sumalatha amabarish,sumalatha ambarish mandya lok sabha,jayaprada,bjp,jaya prada bjp ram pur,rampur bjp jayaprada,election results 2019 live,election result live today,2019 election results,lok sabha elections 2019,lok sabha election 2019,lok sabha election 2019 result,lok sabha election result,lok sabha election 2019 result live,election live results,election results,lok sabha election results 2019,election result 2019,lok sabha result,election 2019,లోక్‌సభ ఎన్నికల ఫలితాలు,ఎన్నికల ఫలితాలు,సుమలత,సుమలత అంబరీష్ మాండ్యా లోక్‌సభ స్థానం,సుమలత అంబరీష్,జయప్రద,జయప్రద,బీజేపీ,రామ్ పూర్ బీజేపీ జయప్రద,జయప్రద వెనకంజ
సుమలత,జయప్రద


మరోవైపు యూపీలోని రామ్‌పూర్ నుంచి లోక్‌సభ బరిలో దిగిన జయప్రద..తన సమీప ప్రత్యర్థి ఆజాం ఖాన్ కంటే రేసులో వెనకబడింది. మరోవైపు దక్షిణాదిలో ప్రకాష్ రాజ్ రేసులో వెనకబడితే.. సుమలత ముందుంజలో ఉంది. మొత్తానికి చివరి ఫలితం తేలే వరకు ఎవరు ఎంపీ అభ్యర్ధులుగా ఎవరు లోక్‌సభలో అడుగుపెడతారో చూడాలి.

First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...