AP Election Result 2019: ఏపీలో ఎన్నికల్లో పవర్ చూపించని పవన్ కళ్యాణ్..

2019లో పవన్ కళ్యాణ్ జనసేన ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. అంతేకాదు ఎక్కడ కనీసం పోటీ ఇవ్వలేకపోవడాన్ని పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

news18-telugu
Updated: May 23, 2019, 2:13 PM IST
AP Election Result 2019: ఏపీలో ఎన్నికల్లో పవర్ చూపించని పవన్ కళ్యాణ్..
జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్
news18-telugu
Updated: May 23, 2019, 2:13 PM IST
అన్నయ్య చిరంజీవి అడుగుజాడల్లో సినిమాల్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన  పవన్ కళ్యాణ్.... అన్నయ్య ప్రజా రాజ్యంతో సాధించలేనిది తను జనసేనతో సాధించాలనే పట్టుదలతో 2014 ఎన్నికల ముందు జనసేనను స్థాపించాడు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడా పోటీకి దిగకుండా బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లు గడిచేసరికి బీజేపీ, టీడీపీ బంధానికి గుడ్ బై చెప్పి 2019 ఎన్నికల్లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో పాటు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాకతో పాటు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసినా.. ఎక్కడ ప్రభావం చూపించలేకపోవడం పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్.. మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఒక్క రాజోలు లో మాత్రమే జనసేన లీడ్‌లో ఉంది. ఇక లోక్‌సభ నియోజకవర్గాల గురించి అసలు మాట్లాడకపోవడమే మంచిది. ఎక్కడ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది జనసేన పార్టీ.

Lok Sabha Election 2019 Result: Pawan Kalyan Janasena party shows no effect in Andhra Pradesh Assembly Lok sabha elections,Pawan kalyan,Pawan kalyan kalyan shows no effect in andhra pradesh,Pawan kalyan kalyan shows no effect in andhra pradesh Assembly lok sabha Elections,janasena chief pawan kalyan trailing,pawan kalyan no effect in ap elections,prakash raj trailing,election results 2019,live election result 2019,election results 2019 live,election result live today,2019 election results,lok sabha elections 2019,lok sabha election 2019,lok sabha election 2019 result,lok sabha election result,lok sabha election 2019 result live,election live results,election results,lok sabha election results 2019,election result 2019,lok sabha result,election 2019,పవన్ కళ్యాణ్ వెనకంజ,ప్రకాష్ రాజ్, ప్రకాష్ రాజ్ వేకకంజ,భీమవరం,భీమవరంలో పవన్ కళ్యాణ్ వెనకంజ,గాజువాక లో ముందంజ,బెంగళూరు సెంట్రల్‌ లో వెనకంజ,ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయిన పవన్ కళ్యాణ్,ఏపీ లో జనసేన ప్రభావం శూన్యం,జనసేనతో ప్రభావం చూపించలేకపోయిన పవన్ కళ్యాణ్,
పవన్ కళ్యాణ్


ఇక2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ  తరుపున చిరంజీవి కోస్తా జిల్లాలోని పాలకొల్లుతో పాటు రాయలసీమలోని తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి.. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో తన  సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి చేతిలో ఓటమి పాలయ్యారు. పాలకొల్లులో ఓడిపోయినా.. తిరుపతి నుంచి మాత్రం చిరు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ  ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ 18 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ ‘యువరాజ్యం’ అధ్యక్షుడిగా పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. అన్నయ్య చిరంజీవి వచ్చిన 18 సీట్లు వచ్చాయి. ఇక జనసేన ఏపీ అసెంబ్లీలో ఒక్క సీటుకే పరిమితం కానున్నట్టు ట్రెండ్స్ చూస్తే చెప్పొచ్చు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల్లో ఏదో చేద్దామనుకున్న పవన్ కళ్యాణ్‌కు ఈ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురి చేసాయి. ఇక బీఎస్పీతో కలిసి ఒక వర్గం ఓట్లను దక్కించుకోవాలనకున్న పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ఎక్కడ సఫలం కాలేదు. మొత్తానికి ఈ ఎన్నికలు పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసాయి.




 
First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...