నిజామాబాద్‌లో టీఆర్ఎస్‌కు షాక్... ఎంపీ కవిత వెనుకంజ

నిజామాబాద్‌లో టీఆర్ఎస్ తరపున కవిత. బీజేపీ నుంచి డీఎస్ కుమారుడు అరవింద్, ఇంకోవైపు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పోటీ చేస్తున్నారు. వీరితోపాటు 178 మంది రైతులు కూడా పోటీలో ఉన్నారు.

news18-telugu
Updated: May 23, 2019, 10:53 AM IST
నిజామాబాద్‌లో టీఆర్ఎస్‌కు షాక్... ఎంపీ కవిత వెనుకంజ
ఎంపీ కవిత(ఫైల్ ఫోటో)
  • Share this:
నిజామాబాద్‌లో టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి, సీఎం కేసీఆర్ కూతురు కవిత వెనుకంజలో ఉన్నారు. కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ దూసుకుపోతున్నారు. అరవింద్, కవితపై 18,000 ఓట్ల తేడాతో దూసుకెళ్తున్నారు. నిజామాబాద్‌లో టీఆర్ఎస్ తరపున కవిత. బీజేపీ నుంచి డీఎస్ కుమారుడు అరవింద్, ఇంకోవైపు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పోటీ చేస్తున్నారు. వీరితోపాటు 178 మంది రైతులు కూడా పోటీలో ఉన్నారు.

అయితే నిజామాబాద్‌లో గెలుపు మీద బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. అక్కడ కేసీఆర్ కుమార్తె కవితకు షాక్ ఇస్తామని ధీమాగా ఉంది. అందుకు ప్రధాన కారణం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. డి.శ్రీనివాస్ కుమారుడు అరవింద్ బీజేపీ నుంచి ఇక్కడ బరిలో నిలిచారు. డీఎస్ కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయనకు హస్తం పార్టీలోని చాలా మంది ద్వితీయశ్రేణి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తన పరిచయాలను ఉపయోగించుకుని డీఎస్ కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులను బీజేపీకి అనుకూలంగా మార్చినట్టు తెలుస్తోంది.

మరోవైపు మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖరరెడ్డి అక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి, తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని కిరణ్ కుమార్ యాదవ్ పై లీడింగ్ లో దూసుకుపోతున్నారు.

 
First published: May 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading