ఎగ్జిట్ పోల్ అంచనాలకు తగ్గట్టే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తొలి రౌండ్లో ఎన్డీఏ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో రామ్‌పూర్ ఒకటి. ఇక్కడ బీజేపీ తరుపున జయప్రద ఎంపీగా పోటీ చేసింది. గతంలో ఇదే నియోజకవర్గంలో జయప్రద సమాజ్ వాదీ పార్టీ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచింది. గత ఎన్నికల్లో ఆర్ఎల్డీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన జయప్రద..2019 ఎన్నికల్లో బీజేపీ తరుపున బరిలో నిలిచింది. ఇక్కడ సమీప ప్రత్యర్ధి ఆజాంఖాన్ సమాజ్ వాదీ పార్టీ తరుపున బరిలో ఉన్నారు. రెండు రౌండ్లు ముగిసే సమయానికి జయప్రద కాస్తంత వెనకబడ్డట్టు ట్రెండ్స్ చెబుతున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మరో లోక్‌సభ స్థానం ‘మాండ్యా’. ఇక్కడ రెండు రౌండ్లు ముగిసే సమయానికి సుమలత ..తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్ధి ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ్ పై ముందంజలో ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే.. మాండ్యాలో సుమలత గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏమైనా చివరి రౌండ్ ఫలితం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.