Lok Sabha Election 2019 Result: హిందూపూర్‌లో బాలయ్య.. నగరిలో రోజా ముందంజ..

బాలకృష్ణ, రోజా

సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స్పష్టమైన మెజారీటీ దిశగా దూసుకుపోతుంది. బాలయ్య, రోజాలు వాళ్ల వాళ్ల నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • Share this:
సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స్పష్టమైన మెజారీటీ దిశగా దూసుకుపోతుంది. మరోవైపు ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక వైసీపీ తరుపున చిత్తూరు జిల్లాలోని నగరి నుంచి పోటీ చేసిన రోజా మాత్రం ఈ నియోజకవర్గంలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. రోజా ఏ పార్టీలో ఉంటే ఆ  పార్టీ గెలవదన్న సెంటిమెంట్‌ను బ్రేక్ చేయబోతుంది. ఒకవేళ రోజా ఇదే ఆధిక్యాన్ని కొనసాగించి గెలిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి క్యాబినేట్‌లో మంత్రి పదవి ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు హిందూపూర్‌లో టీడీపీ తరుపున బాలకృష్ణ రెెండోసారి బరిలో దిగారు. ఇక్కడ బాలయ్య బొటాబోటీ మెజారటీతో నెట్టుకొస్తున్నాడు. చివరి వరకు ఆధిక్యం కొనసాగితేనే బాలయ్య గెలుపు తథ్యం అంటున్నారు. మొత్తం అనంతపూరంలో టీడీపీ హిందూపూర్, రాప్తాడు నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
First published: