news18-telugu
Updated: May 23, 2019, 11:09 AM IST
హేమా మాలినితో పాటు ఆమె సవతి కొడుకు కూడా బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచాడు (Twitter/Photo)
ఎగ్జిట్ పోల్ అంచనాలకు తగ్గట్టే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ కూటమి కలిసి పోటీ చేసినా.. బీజేపీ ఆధిపత్యాన్ని అడ్డుకోలేకుండా పోయినట్టు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఒకే ఫ్యామిలీ నుంచి చిన్నమ్మ, కొడుకు వరుసన హేమా మాలిని, సన్ని డియోల్ బీజేపీ తరుపున పోటీ చేసారు. హేమా మాలిని ఉత్తర ప్రదేశ్లోని మథుర నుంచి నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉంది. మరోవైపు హేమా మాలిని.. కొడుకు వరుసైన సన్ని డియోల్ మాత్రం పంజాబ్లోని గురుదాస్ పూర్ నుంచి లీడ్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బీజేపీ తరుపున పోటీ చేసిన ఈ తల్లి కొడుకులు ఆధిక్యంలో ఉండటం విశేషం. కడ వరకు ఇవే ఫలితాలు కంటిన్యూ ఐతే.. హేమా మాలిని, సన్ని డియోల్ల గెలుపును ఎవరు ఆపలేరు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
May 23, 2019, 11:09 AM IST