ఫేస్‌బుక్‌లో ఎన్నికల ప్రచార జోరు...బీజేపీకి దరిదాపుల్లో లేని కాంగ్రెస్

Lok sabha Election 2019 | ఫిబ్రవరి-మార్చి 30 మధ్యకాలంలో ఎఫ్‌బీలో రాజకీయ పార్టీలు వారి మద్దతుదారులు రూ.10 కోట్లకు పైగా ప్రకటనలు చేశారు. యాడ్స్ కోసం అత్యధికంగా వెచ్చించిన పార్టీగా బీజేపీ అగ్రస్థానంలో నిలవగా...బీజేపీతో పోల్చితే కాంగ్రెస్ బాగా వెనుకబడింది.

news18-telugu
Updated: April 7, 2019, 8:53 PM IST
ఫేస్‌బుక్‌లో ఎన్నికల ప్రచార జోరు...బీజేపీకి దరిదాపుల్లో లేని కాంగ్రెస్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా పాత్ర మునుపెన్నడూ లేనంత స్థాయికి చేరింది. సోషల్ మీడియా ద్వారా యువతకు దగ్గరయ్యేందుకు రాజకీయ పార్టీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఎన్నికల పుణ్యమా అని మరీ ముఖ్యంగా ఫేస్‌బుక్‌కు కాసుల పంట పండుతోంది. ఫిబ్రవరి-మార్చి మాసంలో రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల మద్దతుదారులు ఇచ్చిన రాజకీయ ప్రకటనల ద్వారా  ఫేస్‌బుక్ సంస్థ రూ.10 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.

ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీ నివేదిక మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి 30 వరకూ ఫేస్‌బుక్‌లో 51,810 రాజకీయ ప్రకటనలు ఇచ్చాయి. వీటి ద్వారా ఫేస్‌బుక్‌కి రూ 10.32 కోట్ల రాబడి వచ్చింది. ఇందులో బీజేపీ, ఆ పార్టీ మద్దతుదారులనుంచి వచ్చిన యాడ్సే ఎక్కువ. అంతకుముందు వారం (మార్చి 23 వరకూ)లో ఈ తరహా రాజకీయ ప్రకటనల సంఖ్య 41,974 కాగా ఎఫ్‌బీకి రూ.8.58 కోట్లు రాబడి వచ్చింది.

‘భారత్ కీ మన్‌కీ బాత్’ పేజ్ కోసం బీజేపీ మద్దతుదారులు 3,700 ప్రకటనలు ఇవ్వగా...ఈ యాడ్స్ కోసం ఎఫ్‌బీకి రూ.2.23 కోట్లు చెల్లించారు. ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ మోడీ’, ‘నేషన్ విత్ నమో’ పేజ్‌ల కోసం 1100 ప్రకటనలు ఇవ్వగా...దీని కోసం ఎఫ్‌బీకి రూ.36.2 లక్షలు చెల్లించారు. బీజేపీతో పోల్చితే ఎఫ్‌బీ ప్రకటనల్లో కాంగ్రెస్ చాలా వెనుకబడింది. ఫిబ్రవరి-మార్చి 20 మధ్యకాలంలో 410 ప్రకటనలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ...దీని కోసం రూ.5.91 లక్షలు వెచ్చించింది. ఒడిశాలోని అధికారపక్షం బీజూ జనతాదళ్(బీజేడీ) ఎఫ్‌బీ ప్రకటనల కోసం రూ.8.56 లక్షలు వెచ్చింది.

తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రూ.1.58 లక్షలు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీసీ) ఎఫ్‌బీ ప్రకటనల కోసం రూ.58,355 వెచ్చించింది.
First published: April 7, 2019, 8:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading