ఏప్రిల్ 11వ తేదీ నుంచి సుదీర్ఘంగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ మే 19వ తేదీతో ముగియనుంది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 నియోజకవర్గాల్లో ఆదివారం చివరిదైన ఏడో దశ పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్-13 సీట్లు, పంజాబ్-13 , పశ్చిమ బెంగాల్-9, బీహార్-8, మధ్యప్రదేశ్-8, హిమాచల్ ప్రదేశ్-4, ఝార్ఖండ్-3, చండీగఢ్-1 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏడో దశలో పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో మొత్తం 918 మంది అభ్యర్థులు పోటిలో ఉన్నారు.ఏడు దశల పోలింగ్‌కు సంబంధించి మే 23వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈలోపు ఏడో దశ పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడవుతాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై న్యూస్18 ఎప్పటికప్పుడు మీకోసం లైవ్ అప్డేట్స్ అందిస్తుంది.