Lok Sabha Elections 2019 Live Updates : పుల్వామా పోలింగ్ బూత్‌పై మరో గ్రెనేడ్ దాడి

Lok Sabha Elections 2019 Phase 5 Updates: ఐదో విడత పోలింగ్‌లో 2కోట్ల 47లక్షల 9వేల మంది ఓటర్లు, 28,072 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

  • News18 Telugu
  • | May 06, 2019, 14:56 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED 3 YEARS AGO

    AUTO-REFRESH

    Highlights

    14:47 (IST)

    బెంగాల్‌లో ఉద్రిక్తతలు

    బెంగాల్‌లోని హౌరాలో టీఎంసీ-బీజేపీ నేతలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సంక్రాలి పోలింగ్ బూత్ ఎదుట ఇరు వర్గాలు కర్రలు, రాడ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జి జరిపి ఇరువర్గాలను చెదరగొట్టారు.

    14:44 (IST)

    జార్ఖండ్ రాజధాని రాంచీలోని జవహర్ విద్యామందిర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న క్రికెటర్ ఎంఎస్ ధోనీ

    14:43 (IST)

    పోలింగ్ బూత్‌పై గ్రెనేడ్ దాడి

    సౌత్ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉన్న ఓ పోలింగ్ బూత్‌పై గ్రెనేడ్ దాడి జరిగింది. అయితే దాడిలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అంతకుముందు ఉదయం ఓ పోలింగ్ బూత్‌పై గ్రెనేడ్ దాడి కలకలం రేపింది. ఓటర్లను పోలింగ్ బూత్‌ వద్దకు రాకుండా భయభ్రాంతులకు గురిచేసేందుకే ఈ దాడులకు పాల్పడుతున్నట్టు సమాచారం.

    13:45 (IST)

    పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ..


    13:11 (IST)

    ఫని తుఫాన్‌పై సమీక్షకు మమత ఒప్పుకోలేదు : మోదీ

    ఫని తుఫాన్ సహాయక చర్యల విషయంలో కేంద్రం-బెంగాల్ సర్కార్ మధ్య పరస్పర విమర్శల దాడి జరుగుతోంది. తుఫాన్‌పై సమీక్షకు మమతా ఒప్పుకోలేదని ప్రధాని మోదీ చెబుతుంటే.. అసలు కేంద్రం నుంచి తమకెలాంటి సమాచారం రాలేదని మమతా సర్కార్ చెబుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బెంగాల్‌లోని తమ్లుక్‌లో పర్యటించిన మోదీ మమతాపై విమర్శలు గుప్పించారు. తాను మమతతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఆమె మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదన్నారు. అయినప్పటికీ మరోసారి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించానని.. అయినా ఆమె తీరులో మార్పు లేదని అన్నారు.

    12:57 (IST)

    మధ్యప్రదేశ్‌లోని ఓ పట్టణంలో తన తండ్రి అంత్యక్రియల అనంతరం ఓటు వేసేందుకు వచ్చిన ఓ యువకుడు..
     

    12:41 (IST)

    బెంగాల్ ఉద్రిక్తతలు

    హౌరాలోని ఫోర్‌షోర్ రోడ్డులో ఉన్న ఓ పోలింగ్ బూత్ ఎదుట కూర్చున్న బీజేపీ కార్యకర్తపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినట్టుగా సమాచారం. గాయపడ్డ బీజేపీ కార్యకర్తను ప్రశాంత వర్మగా గుర్తించారు. ప్రస్తుతం అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    12:40 (IST)

    ఐదో విడత ఎన్నికల బరిలోని అభ్యర్థుల వివరాలు..


    సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు దేశవ్యాప్తంగా ఐదో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదో విడతలో 7 రాష్ట్రాల్లోని 51 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది . ఇందులో ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, రాజస్థాన్‌ 12, మధ్యప్రదేశ్‌ 7, పశ్చిమ బెంగాల్‌ 7, బిహార్‌లో 5, జార్ఖండ్‌ 4, జమ్ముకశ్మీర్‌లో 2 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా పోటీ చేస్తున్న అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు ఈ విడతలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేస్తున్న లక్నో లోక్‌సభ స్థానానికి కూడా ఇదే విడతలో పోలింగ్ జరుగుతుంది.మొత్తంగా ఐదో విడతలో దేశవ్యాప్తంగా 674 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

    ఐదో విడత పోలింగ్‌లో 2కోట్ల 47లక్షల 9వేల మంది ఓటర్లు, 28,072 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు కోసం 578 పారామిలటరీ బలగాలను ఇప్పటికే అక్కడ మోహరించారు. పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.