LIVE NOW

ముగిసిన మూడోదశ పోలింగ్..బెంగాల్ ఘర్షణలో ఒకరు మృతి

3rd Phase Lok Sabha Election 2019: మూడో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. బెంగాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి.

Telugu.news18.com | April 23, 2019, 8:21 PM IST
facebook Twitter Linkedin
Last Updated April 23, 2019
auto-refresh

Highlights

దేశంలో మూడోదశ ఎన్నికలకు పోలింగ్ గడువు ముగిసింది. దేశంలోని 116 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో హింస జరిగింది. ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ముర్షీదాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓ దుండగుడు బాంబు విసిరాడు. మరికొన్నిచోట్ల బీజేపీ- టీఎంసీ కార్యకర్తలు కొట్టుకున్నారు. ఓ పోలింగ్ బూత్ బయట ఏర్పాటు చేసిన టెంట్లను పీకేశారు. పలువురు ప్రముఖులు కూడా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వంటి ప్రముఖులు ఓటు వేశారు.

దేశంలోని 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 116 నియోజకవర్గాల జరుగుతున్న ఈ ఎన్నికల్లో 1,640 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గుజరాత్ 26 స్థానాలు, కేరళ 20, గోవా 2, కర్ణాటక 14, మహారాష్ట్ర 14, ఒడిషా 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 4, బీహార్ 5, చత్తీస్ గడ్ 7, జమ్మూ కాశ్మీర్ 1 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా, డయ్యూడామన్, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో చెరో నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించారు.

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి మూడో దశతోపాటు నాలుగు, అయిదు దశల్లో పోలింగ్‌ జరగనుంది. దేశంలో ఇలా మూడు దశల్లో పోలింగ్‌ జరుగుతున్న ఏకైక నియోజకవర్గం ఇదొక్కటే. కేరళలోని వయనాడ్ నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, గుజరాత్ గాంధీ నగర్ నుంచి పోటీ చేస్తున్న అమిత్‌షా, ములాయంసింగ్‌ యాదవ్‌, జయప్రద, వరుణ్‌ గాంధీ, సుప్రియా సూలె, శశిథరూర్‌, మల్లికార్జున్‌ ఖర్గే వంటి పలువురు ప్రముఖ నేతలు మూడో దశ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఈ దశలోనే ఒడిశా రాష్ట్రంలోని 42 శాసనసభ స్థానాలకు  పోలింగ్‌ జరిగింది.
Load More