మూడో దశ ఎన్నికల్లో పోలింగ్ శాతం..రాష్ట్రాల వారీగా..
19:1 (IST)
పోలింగ్ సందర్భంగా బెంగాల్లో హింస చెలరేగడంపై కాంగ్రెస్ మండిపడింది. ఎన్నికల సంఘం వైఫల్యాల వల్లే హింసాత్మక ఘటన చెలరేగాయని విమర్శిస్తున్నారు. ఈసీ తీరుకు నిరసనగా కోల్‌కతాలోని ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.
సాయంత్రం 5 గంటల సమయానికి గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాల్లో 59.35శాతం పోలింగ్ నమోదైంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది.
17:18 (IST)
మూడోదశ ఎన్నికలకు ఎన్నికల గడువు ముగిసింది. దేశంలోని 116 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ వ్యక్తి కూడా చనిపోయాడు. కేరళలో ఓటు వేయడానికి వచ్చిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అసోంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
16:20 (IST)
అసోంలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి 62.13శాతం పోలింగ్ నమోదైంది.
16:7 (IST)
మూడోదశ ఎన్నికలపై గ్రాఫిక్
దేశంలో మూడోదశ ఎన్నికలకు పోలింగ్ గడువు ముగిసింది. దేశంలోని 116 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో హింస జరిగింది. ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ముర్షీదాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓ దుండగుడు బాంబు విసిరాడు. మరికొన్నిచోట్ల బీజేపీ- టీఎంసీ కార్యకర్తలు కొట్టుకున్నారు. ఓ పోలింగ్ బూత్ బయట ఏర్పాటు చేసిన టెంట్లను పీకేశారు. పలువురు ప్రముఖులు కూడా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వంటి ప్రముఖులు ఓటు వేశారు.
దేశంలోని 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 116 నియోజకవర్గాల జరుగుతున్న ఈ ఎన్నికల్లో 1,640 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గుజరాత్ 26 స్థానాలు, కేరళ 20, గోవా 2, కర్ణాటక 14, మహారాష్ట్ర 14, ఒడిషా 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 4, బీహార్ 5, చత్తీస్ గడ్ 7, జమ్మూ కాశ్మీర్ 1 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా, డయ్యూడామన్, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో చెరో నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించారు.
జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గానికి మూడో దశతోపాటు నాలుగు, అయిదు దశల్లో పోలింగ్ జరగనుంది. దేశంలో ఇలా మూడు దశల్లో పోలింగ్ జరుగుతున్న ఏకైక నియోజకవర్గం ఇదొక్కటే. కేరళలోని వయనాడ్ నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, గుజరాత్ గాంధీ నగర్ నుంచి పోటీ చేస్తున్న అమిత్‌షా, ములాయంసింగ్ యాదవ్, జయప్రద, వరుణ్ గాంధీ, సుప్రియా సూలె, శశిథరూర్, మల్లికార్జున్ ఖర్గే వంటి పలువురు ప్రముఖ నేతలు మూడో దశ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఈ దశలోనే ఒడిశా రాష్ట్రంలోని 42 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరిగింది.