LIVE NOW

Lok Sabha Election 2019 : ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఘట్టం.. మే 23న ఓట్ల లెక్కింపు

Lok Sabha Election 2019 : దేశంలోని 542 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏడు విడతల్లో ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 23న అన్ని స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Telugu.news18.com | May 19, 2019, 6:16 PM IST
facebook Twitter Linkedin
Last Updated May 19, 2019
auto-refresh

Highlights

దేశంలో 2019 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఓటరు దేవుళ్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో ఒక్క స్థానం(వేలూరు) మినహా మిగిలిన స్థానాలన్నింటికి ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11న మొదటి విడత ఎన్నికలు ప్రారంభం కాగా.. ఇవాళ(మే19) చివరి విడత పోలింగ్ పూర్తి చేశారు. ఎన్నికలు జరిగిన అన్ని లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును మే 23న చేపట్టనున్నారు.

చివరి విడతలో ఇవాళ  59 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. మొత్తం  ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పోలింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్‌ 13 నియోజకవర్గాలు, జార్ఖండ్‌ 3, మధ్యప్రదేశ్‌, 8, పంజాబ్‌ 13, పశ్చిమబెంగాల్లో 9, చండీఘర్‌ 1, బీహార్‌ 8, హిమాచల్‌ ప్రదేశ్‌లో 4 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు ముగిశాయి. బెంగాల్‌లో మొదటి దశ నుంచి చివరి వరకు హింసాత్మక వాతావరణంలోనే ఎన్నికలు జరిగాయి. మొత్తం మీద దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు తెరపడటంతో ఇక ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

 
Load More