Lok Sabha Election 2019 : ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఘట్టం.. మే 23న ఓట్ల లెక్కింపు
Lok Sabha Election 2019 : దేశంలోని 542 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏడు విడతల్లో ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 23న అన్ని స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
దేశవ్యాప్తంగా ఏడవ విడత ఎన్నికలు ముగిశాయి. బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రశాంతంగానే ఎన్నికలు జరిగాయి.
16:38 (IST)
తగలబడ్డ తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయం..
బెంగాల్‌లోని భట్పారా నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తగలబడింది. బీజేపీ నేత అర్జున్ సింగ్‌కు పట్టున్న ప్రాంతం ఇది. అంతకుముందు పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే.. ఇరు వర్గాలు క్రూడ్ బాంబ్స్, ఇటుకలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి.
16:36 (IST)
తృణమూల్‌పై సీపీఎం ఆరోపణలు
డైమండ్ హార్బర్, డుమ్ డుమ్, కోల్‌కతా నార్త్‌లలో తృణమూల్ కాంగ్రెస్ భారీ ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ఆరోపించారు.జాదవ్‌పూర్ లోక్‌సభ పరిధిలోని బఘాజతిన్ బూత్ క్యాంప్‌పై టీఎంసీ గూండాలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
16:31 (IST)
తృణమూల్ ఎంపీ ధర్నా
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బరాసత్ లోక్‌సభ అభ్యర్థి కకోలి ఘోష్ న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని..'జైశ్రీరామ్' నినాదాలు చేయాలని ఓటర్లను భయపెడుతున్నాయని ఆరోపించారు.
15:45 (IST)
ఓటు వేసేందుకు వీల్ చైర్లో వచ్చిన ఓ వికలాంగుడు..
15:43 (IST)
పంజాబ్‌లో ఉద్రిక్తతలు
పంజాబ్‌లోని తల్వంది పోలింగ్ బూత్ 122 వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడటంతో కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
15:21 (IST)
బెంగాల్లో ఇప్పటివరకు నమోదైన పోలింగ్
డుమ్ డుమ్, -49.31%
బరాసత్-55.35%
బసిర్హట్-58.12%
జయ్నగర్ (ఎస్సీ)-58.96%
మధురాపూర్ (ఎస్సీ)-56.77%
డైమండ్ హార్బర్-54.03%
జాదవ్‌పూర్-57.37%
కోల్‌కతా దక్షిణ్-46.14%
కోల్‌కతా నార్త్-44.38%
15:14 (IST)
ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన నవ దంపతులు
బెంగాల్లో కేంద్ర బలగాలు బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రియాన్ ఆరోపించారు. సామాన్యులను, అట్టడుగు వర్గాల వారిని ఓట్లు వేయకుండా వారే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇది ఎన్నికల నియామవళిని ఉల్లంఘించడమేనని అన్నారు.
దేశంలో 2019 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఓటరు దేవుళ్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో ఒక్క స్థానం(వేలూరు) మినహా మిగిలిన స్థానాలన్నింటికి ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11న మొదటి విడత ఎన్నికలు ప్రారంభం కాగా.. ఇవాళ(మే19) చివరి విడత పోలింగ్ పూర్తి చేశారు. ఎన్నికలు జరిగిన అన్ని లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును మే 23న చేపట్టనున్నారు.
చివరి విడతలో ఇవాళ 59 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. మొత్తం ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పోలింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్ 13 నియోజకవర్గాలు, జార్ఖండ్ 3, మధ్యప్రదేశ్, 8, పంజాబ్ 13, పశ్చిమబెంగాల్లో 9, చండీఘర్ 1, బీహార్ 8, హిమాచల్ ప్రదేశ్‌లో 4 స్థానాలకు పోలింగ్ జరిగింది. బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు ముగిశాయి. బెంగాల్లో మొదటి దశ నుంచి చివరి వరకు హింసాత్మక వాతావరణంలోనే ఎన్నికలు జరిగాయి. మొత్తం మీద దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు తెరపడటంతో ఇక ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.