news18-telugu
Updated: May 19, 2019, 6:14 PM IST
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఏప్రిల్ 11 నుంచి ఇవాళ్టి (మే 19) వరకు మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 542 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించగా.. ధనప్రవాహం కారణంగా తమిళనాడులోని వేలూరు లోక్సభ నియోజకవర్గంలో రెండో విడతలో ఏప్రిల్ 18న జరగాల్సిన ఎన్నికను రద్దుచేశారు. ఓట్ల లెక్కింపును మే 23న ఉదయం 8 గంటల నుంచి ప్రారంభిస్తారు. ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం కాగా...మరో కాసేపట్లో వెలువడనున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి.
మొదటి విడతలో ఏప్రిల్ 11న ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలంగాణలోనూ 17 లోక్సభ స్థానాలకు మొదటి విడతలోనే ఎన్నికలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. ఏడో విడతలో మొత్తం 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 7.27 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 3.47 కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు. తుది విడతలో సాయంత్రం 6 గంటల వరకు 60.21 శాతం పోలింగ్ నమోదయినట్లు వెల్లడించింది.
First published:
May 19, 2019, 6:05 PM IST