భారతదేశంలో ఎన్నికల సంగ్రామం ముగిసింది. ఏడో విడత పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ హడావుడి మొదలైంది. News18-IPSOS ఎగ్జిట్ పోల్‌తో పాటు టైమ్స్ నౌ, సీఓటర్, ఇండియా టీవీ లాంటి మీడియా ఛానెళ్లు, సర్వే సంస్థలు లోక్‌సభ ఎన్నికల ఫలితాల అంచనాలను వెల్లడించాయి. టైమ్స్ నౌ-వీఎంఆర్ ఎగ్జిట్ పోల్‌లో ఎన్డీఏకే ఆధిక్యం దక్కింది. ఎన్డీఏకు 306 సీట్లు వస్తాయని అంచనా వేయగా, యూపీఏకి 142 సీట్లు, ఇతరులకు 94 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ-వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ అంచనా. ఇక ఓటింగ్ చూస్తే ఎన్‌డీఏకు 41.1 శాతం, యూపీఏకి 31.7 శాతం, ఇతరులకు 27.2 శాతం ఓట్లు వస్తాయని టైమ్స్ నౌ-వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.
జన్ కీ బాత్ అంచనా ప్రకారం ఎన్‌డీఏకు 305, యూపీఏకు 124, మహాకూటమికి 26, ఇతరులకు 87 సీట్లు వస్తాయి. రిపబ్లిక్-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్‌డీఏకు 305, యూపీఏకు 124, మహాకూటమికి 26, ఇతరులకు 87 సీట్లు వస్తాయి. రిపబ్లిక్-సీఓటర్ అంచనా ప్రకారం ఎన్డీఏకు 287, యూపీఏకి 128, ఎస్‌పీ-బీఎస్పీ కూటమికి 40, ఇతరులకు 87 స్థానాలు వస్తాయి. న్యూస్ నేషన్ అంచనా ప్రకారం బీజేపీ కూటమికి 282-290, కాంగ్రెస్ కూటమికి 118-126, ఇతరులకు 130-138 మధ్య వస్తాయి.
అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్‌డీఏ కూటమికే స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. గత ఎన్నికల ఫలితాలతో పోలిస్తే బీజేపీ కూటమికి సీట్ల సంఖ్య కాస్త తగ్గినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను ఎన్‌డీఏ సులువుగా దాటేస్తుందని అంచనా. వేర్వేరు సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో చూడండి.
సర్వే సంస్థ | ఎన్‌డీఏ | యూపీఏ | ఇతరులు |
టైమ్స్ నౌ-వీఎంఆర్ | 306 | 142 | 94 |
రిపబ్లిక్-సీఓటర్ | 287 | 128 | 127 |
రిపబ్లిక్-జన్ కీ బాత్ | 315 | 124 | 113 |
న్యూస్ నేషన్ | 282-290 | 118-126 | 130-138 |
వీడీపీఏ | 333 | 115 | 94 |
ఎన్‌డీటీవీ | 302 | 127 | 133 |
ఇండియా న్యూస్ | 287 | 128 | 127 |
న్యూస్ ఎక్స్ | 242 | 164 | 136 |
ఏబీపీ న్యూస్-నీల్సన్ | 267 | 127 | 148 |
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exit polls 2019, Lok Sabha Elections 2019, Narendra modi, NDA, Pm modi, UPA