• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • LOK SABHA ELECTION 2019 CONGRESS PARTY ELECTION MANIFESTO RELEASED HIGH LIGHTS ARE HERE NK

Congress Election Manifesto : కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హైలెట్స్ ఇవే...

Congress Election Manifesto : కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హైలెట్స్ ఇవే...

ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

Congress Election Manifesto : దేశంలో పేదరికాన్ని నిర్మూలించడమే తమ లక్ష్యమన్న కాంగ్రెస్, అందుకు తగినట్లుగా మేనిఫెస్టోను రూపొందించింది.

  • Share this:
    Congress Election Manifesto :  పేదలు, రైతులు, నిరుద్యోగ యువకులను ఆకట్టుకునేలా ఐదు ప్రధాన అంశాలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నేతలు చిదంబరం, ఏకే ఆంటోనీ తదితరులు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. మేనిఫెస్టోను ఆవిష్కరించి మాట్లాడిన రాహుల్ గాంధీ... కాంగ్రెస్ మేనిఫెస్టో అనేది దేశ అభివృద్ధికి పెద్ద ముందడుగు అన్నారు. ఏడాది క్రితం ఈ ప్రక్రియను మొదలుపెట్టామన్న ఆయన... ప్రజల ఆకాంక్షలు మేనిఫెస్టోలో ఉండాలని చిదంబరానికి చెప్పినట్లు తెలిపారు. మేనిఫెస్టో వాస్తవాలకు దగ్గరగా ఉండాలనీ, అబద్ధాలు ఉండకూడదని చెప్పానన్నారు.

    congress manifesto,congress manifesto 2019,congress election manifesto highlights,election manifesto,congress,lok sabha election 2019,congress manifesto for 2019 elections,manifesto,election 2019,lok sabha elections 2019,rahul gandhi election manifesto,2019 lok sabha election,congress election manifest,congress releases election manifesto,elections 2019,congress loksabha elections manifesto, lok sabha elections 2019,lok sabha election 2019,lok sabha elections,2019 lok sabha elections,lok sabha election,lok sabha,india lok sabha election 2019,lok sabha polls,mandya lok sabha elections,lok sabha elections survey,india lok sabha election date,lok sabha elections 2019 opinion poll,lok sabha elections 2019 live updates,election 2019,loksabha election 2019,election counting updates,లోక్ సభ ఎన్నికలు,పార్లమెంట్ ఎన్నికలు,సార్వత్రిక ఎన్నికలు,జనరల్ ఎన్నికలు,ప్రధానమంత్రి,కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో,
    ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో రాహుల్ గాంధీ


    కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కనీస ఆదాయ పథకాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కనీస ఆదాయ పథకం (న్యాయ్) కింద ప్రతీ పేదవాడి బ్యాంక్ అకౌంట్‌లో రూ.72000 జమ చేయనున్నట్లు రాహుల్ తెలిపారు. అలాగే రైతులు, నిరుద్యోగ యువత, మహిళల సంక్షేమానికి మేనిఫెస్టోలో పెద్ద పీట వేశారు.

    మేనిఫెస్టోలో కీలక అంశాలు :

    * రాజ్యసభలో మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చినట్లుగా అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా

    * ప్రతి పేదవాడి బ్యాంక్ అకౌంట్లో కనీస ఆదాయ పథకం కింద ఏడాదికి రూ.72 వేలు.

    * ఐదేళ్లలో లబ్దిదారుల అకౌంట్లోకి రూ.3.60 లక్షలు.

    * 2020 మార్చిలోపు 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన. గ్రామ పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాల భర్తీ.

    *యువకులు వ్యాపారం చెయ్యాలనుకుంటే మూడేళ్లపాటూ ఎలాంటి అనుమతులూ అక్కర్లేదు.

    *  ఏడాదికి 150 రోజుల పాటు ఉపాధి హామీ పథకం అమలు.  100 రోజుల నుంచి 150 రోజులకు ఉపాధి హామీ పథకం పెంపు.

    * రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్. రైతులు రుణాలు తిరిగి చెల్లించలేకపోతే క్రిమినల్ కేసులు ఉండవు.

    * విద్య కోసం బడ్జెట్లో 6 శాతం నిధులు కేటాయింపు.

    * ప్రజా ఆరోగ్యం విషయంలో ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రోత్సాహం.

    * దేశ భద్రతపై ప్రత్యేక దృష్టి.

    అంతకుముందు మాట్లాడిన మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం... సంపద సృష్టిస్తాం... సంక్షేమానికి పెద్ద పీట వేస్తాం... అన్న నినాదంతో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిపారు.

    కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించండి.

    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు