ఆరో విడత ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతర పార్టీల ముఖ్య నేతలంతా ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేస్తూ ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. మంటుటెండల్లో ఓట్ల కోసం చెమటోడ్చుతున్నారు. మే12న 7 రాష్ట్రాల్లోని మొత్తం 59 నియోజకవర్గాల్లో ఆరో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. యూపీలో 14 సీట్లు, హర్యానాలో 10, బీహార్ 8, మధ్యప్రదేశ్ 8, వెస్ట్ బెంగాల్ 8, ఢిల్లీ 7, జార్ఖండ్‌లో 4 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.