300 సీట్లు పక్కా...బీజేపీ విజయంపై ప్రధాని మోదీ ధీమా

దేశమంతటా బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని..బీజేపీ పక్షాలకు 300 సీట్లు రావడం ఖాయమని స్పష్టంచేశారు. భారత ప్రజలు మరోసారి మెజార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారని చెప్పారు.

news18-telugu
Updated: May 17, 2019, 3:52 PM IST
300 సీట్లు పక్కా...బీజేపీ విజయంపై ప్రధాని మోదీ ధీమా
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
news18-telugu
Updated: May 17, 2019, 3:52 PM IST
లోక్‌సభ ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. ఇవాళ్టితో తుది విడత ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో తన ఆఖరి ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ విజయంపై ధీమావ్యక్తం చేశారు ప్రధాని. దేశమంతటా బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని..బీజేపీ పక్షాలకు 300 సీట్లు రావడం ఖాయమని స్పష్టంచేశారు. భారత ప్రజలు మరోసారి మెజార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారని చెప్పారు.

'అబ్ కీ బార్ 300 పార్', 'ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్' కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు..కచ్ నుంచి కామరూప్‌ వరకు..దేశమంతా ఇవే నినాలు వినిపిస్తున్నాయి. బీజేపీ కూటమికి 300 సీట్లలో విజయం సాధిస్తుంది. 130 కోట్ల మంది ప్రజలు బీజేపీ కూటమినే ఎన్నుకోబుతున్నారు. ఈ ఆదివారం ఓటువేసేటప్పుడు మీరు సరికొత్త చరిత్ర లిఖించబోతున్నారు. దశాబ్ధాల తర్వాత రెండోసారి మెజార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారు.
నరేంద్ర మోదీ


ఆదివారం తుది విడత లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 59 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. దాంతో దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసినట్లవుతుంది. మే 23న ఫలితాలు వెల్లడవుతాయి.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...