సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా...ఆమోదించిన గవర్నర్

చంద్రబాబు

తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ కోరారు

  • Share this:
    ఏపీ సీఎం పదవికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజీనామా చేశారు.  తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌కు ఆయన ఫ్యాక్స్ ద్వారా  రాజీనామా లేఖను పంపించారు. చంద్రబాబు రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఏపీకి చంద్రబాబు చేసిన సేవలకు నరసింహన్ ధన్యవాదాలు తెలిపినట్లు తెలుస్తోంది. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు. మరోవైపు మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది.

    ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 150 సీట్లు సాధించి అఖండ విజయం సాధించింది. అటు లోక్‌సభ ఎన్నికల్లోనూ 20కి పైగా స్థానాలను కైవసం చేసుకుంది. అధికార టీడీపీ కేవలం 24 సీట్లు మాత్రమే పరిమితమైంది.  ఇక ఏపీలో కింగ్ మేకర్ అవుదామనుకున్న జనసేన చిత్తుగా ఓడిపోయింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. కేవలం రాజోలు స్థానంలో మాత్రమే జనసేన గెలిచింది.

     
    First published: