ఇవాళ సాయంత్రమే చంద్రబాబు రాజీనామా..సీఎం పదవికి గుడ్‌బై

Live ap election 2019 result: చంద్రబాబు ఇవాళ సాయంత్రం సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. గవర్నర్ నరసింహన్‌కు రాజీనామా లేఖను పంపిస్తారని సమాచారం.

news18-telugu
Updated: May 23, 2019, 12:00 PM IST
ఇవాళ సాయంత్రమే చంద్రబాబు రాజీనామా..సీఎం పదవికి గుడ్‌బై
చంద్రబాబు (File)
news18-telugu
Updated: May 23, 2019, 12:00 PM IST
ఏపీలో వైసీపీ సునామీ ధాటికి టీడీపీ చిత్తుగా ఓడుతోంది. ఫ్యాన్ గాలి హోరులో సైకిల్ కొట్టుకుపోతోంది. ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే 140కి పైగా స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశముంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇవాళ సాయంత్రం సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. గవర్నర్ నరసింహన్‌కు రాజీనామా లేఖను పంపిస్తారని సమాచారం. ఐతే కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ సీఎం కొనసాగాల్సిందిగా చంద్రబాబును గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కోరే అవకాశముంది. మరోవైపు సీఎం పగ్గాలు చేపట్టేందుకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారు. విజయ సంకేతాలు రావడంతో విశాఖ శారదా పీఠం స్వరూపనందకు ఫోన్ చేసి ప్రమాణస్వీకార ముహూర్తం గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. మే 30న 'వైఎస్ జగన్ అను నేను'..అని జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...