జగన్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు...కష్టానికి ఫలితం లభించిందని ట్వీట్

Live ap assembly election result 2019; జగన్ కఠోర శ్రమకు ప్రజల ఆశీర్వాదం రూపంలో ఫలితం వచ్చిందన్న కేటీఆర్...తమ సోదర రాష్ట్రం ఏపీకి సుపరిపాలన అందిస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

news18-telugu
Updated: May 23, 2019, 1:14 PM IST
జగన్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు...కష్టానికి ఫలితం లభించిందని ట్వీట్
కేటీఆర్, జగన్
  • Share this:
ఏపీ కాబోయే సీఎం జగన్‌కు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. భారీ విజయం సాధించిన వైసీపీ పార్టీకి ట్విటర్ వేదికగా కంగ్రాట్స్ తెలిపారు. జగన్ కఠోర శ్రమకు ప్రజల ఆశీర్వాదం రూపంలో ఫలితం వచ్చిందన్న కేటీఆర్...తమ సోదర రాష్ట్రం ఏపీకి సుపరిపాలన అందిస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ దూసుకుపోతోంది. ఏకంగా 150 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అధికార టీడీపీకి ఏమాత్రం అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. లోక్‌సభ ఫలితాల్లో 25కు 25 చోట్ల క్లీన్ స్వీప్ దిశగా పరుగులు పెడుతోంది.

First published: May 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>